Teja Sajja : పాన్ ఇండియా హీరో తేజ సజ్జ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆయన మిరాయ్ అనే ఓ పాన్ ఇండియా సూపర్ హీరో సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా తేజ గతంలో తాను కలిసి పని చేసిన, రీసెంట్ గా టిల్లు స్క్వేర్ తో 100 కోట్లు కొల్లగొట్టిన డైరెక్టర్ మల్లిక్ రామ్ తో కలిసి నెక్స్ట్ మూవీ చేయబోతున్నాడని వార్తలు విన్పిస్తున్నాయి.
నెక్స్ట్ మూవీని లైన్ లో పెట్టిన తేజ సజ్జ ?
హనుమాన్ మూవీ ఒక్కసారిగా పాన్ ఇండియా ప్రేక్షకుల మనసును గెలుచుకున్న యంగ్ హీరో తేజ సజ్జా ఇప్పుడు మిరాయ్ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా, ఈ మూవీని తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ, చైనీస్ భాషల్లో 2025 ఏప్రిల్ 18న వేసవిలో 2డి, 3డి వెర్షన్‌లలో విడుదల చేయనున్నట్టు నిర్మాతలు గ్లింప్స్ ద్వారా ప్రకటించారు. ఇక ఆ గ్లింప్స్ కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ షూటింగ్ దశలో ఉండగానే తేజ మరో కొత్త సినిమాను లైన్ లో పెట్టినట్టు సమాచారం. గతంలో తేజ అద్భుతం అనే ఒక సినిమాను చేసిన విషయం తెలుగు మూవీ లవర్స్ కు గుర్తుండే ఉంటుంది. ఈ మూవీ డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. అయితే సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అద్భుతం మూవీ కాంబో మరోసారి రిపీట్ కాబోతోందని సమాచారం. ఈ మూవీ డైరెక్టర్ మల్లిక్ రామ్ తో కలిసి తేజ సజ్జా నెక్స్ట్ ప్రాజెక్టు ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. కానీ తేజ రిస్క్ చేస్తున్నాడా? అనే టాక్ మొదలైంది.
తేజ ధైర్యం ఇదేనా?
తేజ సజ్జ చివరిగా తెలుగులో ‘హనుమాన్’ చిత్రంలో కనిపించారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సూపర్ హీరో చిత్రం బాక్సాఫీస్ వద్ద అనూహ్యంగా మంచి వసూళ్లను సాధించింది. ఇది జనవరి 12 న థియేటర్లలో విడుదలైంది మరియు మహేష్ బాబు ‘గుంటూరు కారం’తో ఢీకొంది. మిరాయ్ తరువాత ఆయన డైరెక్టర్ మల్లిక్ రామ్ తో సినిమా చేయబోతున్నాడు అన్న వార్త తేజ అభిమానులను టెన్షన్ పెడుతోంది. ఇప్పటిదాకా మూడు నాలుగు సినిమాలను మాత్రమే తెరకెక్కించారు డైరెక్టర్ మల్లిక్ రామ్. అద్భుతంతో సహ ముందు ఆయన చేసిన సినిమాలు పెద్దగా ఆడకపోయినా, టిల్లు స్క్వేర్ మూవీతో పక్కా మాస్ ఫీస్ట్ ఇచ్చి తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నారు ఆయన. ఈ మూవీ నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడు టిల్లు స్క్వేర్ రిజల్ట్ ను చూసిన తేజ అదే నమ్మకంతో డైరెక్టర్ మల్లిక్ రామ్ తో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు అనే చర్చ నడుస్తోంది. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు. కానీ ఇప్పుడు తేజ పాన్ ఇండియా హీరో. మరి ఈ పాన్ ఇండియా భారాన్ని మల్లిక్ రామ్ మోయగలరా? అంటే దీనిపై అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చేదాకా ఆగాల్సిందే.