BalagamVenu : లాస్ట్ ఇయర్ తెలుగులో బలగం అనే ఓ మూవీ వచ్చింది. చిన్న సినిమాగా రిలీజై, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు గెలుచుకునేంత పెద్ద హిట్ అయింది. దీనికి డైరెక్టర్ వేణు. ఈ సినిమాకు ముందు వేణు అంటే ఎవరికీ తెలీదు. జబర్ధస్త్ ఫేం వేణు అని అనేవాళ్లు. ఇప్పుడు బలగం వేణు అని అంటున్నారు. తెలంగాణ గ్రామాల్లో చావు, దాని తర్వాత జరిగే కార్యక్రమాలను చాలా ఎమోషనల్‌గా వేణు ఈ సినిమాలో చూపించారు. అందుకే ప్రతి పల్లేలో ఈ సినిమాను ప్రొజక్టర్స్ వేసుకోని మరీ చూశారు. ఇక వేణు(Venu Yeldandi) నుండి రాబోయే ప్రాజెక్ట్ ఎల్లమ్మ అని, దీన్ని దిల్ రాజు నిర్మించబోతున్నారని తెలిసిందే. అయితే ఈ సినిమా చాలా రోజులుగా హీరోల చేతులు మారుతూనే ఉంది.
ఫైనల్ గా ఈ హీరో చేతికి ఎల్లమ్మ..
ఇక ఎల్లమ్మ ప్రాజెక్ట్ అందరికంటే ముందుగా నాని (Nani) చేతికి వెళ్లిందన్న విషయం తెలిసిందే. కానీ రెమ్యూనరేషన్ సమస్యో, లేదా స్క్రిప్ట్ లో చేంజెస్ కోరుకున్నాడో, లేక మరేదైనా కారణమో తెలీదు గాని నాని వదులుకున్నాడు. ఆ తర్వాత శర్వానంద్ చేతికి వెళ్లిందని వార్తలు వచ్చాయి. మొన్నా మధ్య సాయి దుర్గా తేజ్ కూడా ఈ సినిమాలో నటిస్తాడని వార్తలు వచ్చాయి. కానీ ఫైనల్ గా ఈ ప్రాజెక్ట్ తేజ సజ్జా (Teja Sajja) చేతికి వెళ్లిందని సమాచారం. ఇక వేణు కూడా ఈ స్క్రిప్ట్ ని తేజ సజ్జాని దృష్టిలో పెట్టుకుని కొన్ని స్క్రిప్ట్ లో డెవలప్మెంట్ చేస్తున్నాడని తెలుస్తుంది. అయితే ఈ సినిమా స్టోరీ గురించి అప్పుడే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు లీక్ అయ్యాయి.
డివోషనల్ టచ్ తో ఎల్లమ్మ!
ఇక ఎల్లమ్మ స్క్రిప్ట్ ని తేజ సజ్జా ఒకే చేయగా, ఈ సినిమా కొమురవెల్లి మల్లన్న దేవుడి కథ బ్యాక్ డ్రాప్ లో తీసే చిత్రంగా ఉండనుందని సమాచారం. ఇక బలగం లాగానే ఎల్లమ్మ (Yellamma) ప్రాజెక్ట్ కూడా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను తెలిపే విధంగా ఉంటుందని సమాచారం. ఎల్లమ్మ సినిమాను భారీ ఫాంటసీ యాక్షన్ డ్రామాగా, డివోషనల్ టచ్ ఇస్తూ.. పాన్ ఇండియా లెవెల్లో వేణు తెరకెక్కించబోతున్నారని సమాచారం. ముఖ్యంగా ఈ సినిమాలో చివరి 30 నిమిషాలలో ఒక వీరోచితమైన యాక్షన్ ఎపిసోడ్ ఉండబోతుందట. పైగా క్లైమాక్స్ లో హీరో… కొమురవెల్లి మల్లన్న గెటప్ లో కనిపిస్తాడని, ఆ గెటప్ లోనే ఫైట్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ ప్రాజెక్ట్ ఈ నెలలోనే ముహూర్తం పెట్టి ఓపెనింగ్ చేసి, అక్టోబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ చేయనున్నారని సమాచారం. ఇక ఎల్లమ్మ కథ విషయంలో ఈ వార్తలపై ఎంత నిజముందో తెలీదు కానీ, నిజమైతే మాత్రం టాలీవుడ్ లో ఫాంటసీ జోనర్ లో మరో భారీ బ్లాక్ బస్టర్ వచ్చినట్టే అని నెట్టింట కామెంట్స్ వస్తున్నాయి.