Tamannah Bhatia : టాలీవుడ్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా నెంబర్ వన్ రేసులో ఉండే ఈ హీరోయిన్, ఆ తర్వాత వరుస పరాజయాలతో తన స్టార్ డమ్ కోల్పోయింది. పైగా సౌత్ కంటే బాలీవుడ్ పైనే ఎక్కువ శ్రద్ధ పెట్టడంతో ఇక్కడ క్రేజ్ మొత్తం కోల్పోయింది. అయినా అడపాదడపా ఇక్కడ కూడా సినిమాలు చేస్తూనే ఉంది. కానీ సక్సెస్ మాత్రం రావడం లేదు. అయితే బాలీవుడ్ లో మాత్రం జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ బబ్లీ బౌన్సర్, లస్ట్ స్టోరీస్ 2 , వంటి సినిమాలు చేయగా, ఆఖరి సచ్, జీ ఖర్దా వంటి వెబ్ సిరీస్ లలో నటించింది. ఇక ఈ ఇయర్ కూడా మూడు ప్రాజెక్ట్ లతో యమ బిజీగా ఉంది. ఇదిలా ఉండగా తమన్నా అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి తాజాగా నెట్టింట ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది.
లాయర్ గా తమన్నా…
ఇక తమన్నా (Tamannah Bhatia) ఇప్పటివరకు గ్లామర్ ప్రాధాన్యం ఉన్న పాత్రలే ఎక్కువగా చేయగా, అప్పుడప్పుడూ బాహుబలి,సైరా వంటి సినిమాల్లో సీరియస్ పాత్రలు చేసింది. ఇదిలా ఉండగా తాను చేయబోయే కొత్త ప్రాజెక్ట్ లో మరోసారి ఓ సీరియస్ పాత్ర చేయబోతోందని సమాచారం. ఒరిస్సా లో దేశాన్ని కుదిపేసిన ఓ రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, తమన్నా ఇంతకు ముందు నటించిన ఆఖరి సచ్ వెబ్ సిరీస్ నిర్మించిన ప్రీతి తమన్నా రాబోయే ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తుందని సమాచారం. ఇక ఈ ప్రాజెక్ట్ లో తమన్నా ఒక లాయర్ గా కనిపించనుందని సమాచారం. ఇక ఇది ఒక వెబ్ సిరీస్ లాగా తెరకెక్కిస్తుండగా, ఈ సిరీస్ కి కరణ్ జోహార్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం.
ఈసారి సీరియస్ రోల్ లో తమన్నా?
ఇక తమన్నా ఇంతకు ముందు చేసిన పాత్రలు కూడా ఎక్కువగా గ్లామర్ టచ్ రోల్స్ ఉండగా, చాలా తక్కువ సినిమాల్లో సీరియస్ రోల్స్ చేసింది. ఇదిలా ఉండగా లాస్ట్ ఇయర్ తమన్నా భోళా శంకర్ లో లాయర్ పాత్రలో నటించగా, అది డిజాస్టర్ అయింది. అందులో తమన్నా పేరుకే లాయర్.. కానీ ఆ రోల్ తమన్నాకి ఏమాత్రం ఉపయోగపడలేదు. కానీ ఈ సారి రాబోయే ఈ సిరీస్ లో తమన్నా లాయర్ రోల్ చాలా సీరియస్ గా ఉండబోతుందట. మరి ఈ వెబ్ సిరీస్ తమన్నా కి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.