Tamannaah :టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా ( Thamannah) గురించి ఎంత చెప్పినా తక్కువే.. కేరీర్ మొదట్లో వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇండస్ట్రీలోని స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇక ఇప్పటివరకు గ్యాప్ తీసుకోకుండా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇక పర్సనల్ గా మొహమాటం లేని మనిషి.. ఏదైన మనసులో దాచుకోకుండా బయటకు చెప్తుంది. అది నచ్చే ఆమెకు చాలా మంది అభిమానులుగా మారారు. అందుకే తన ప్రేమ విషయాన్ని కూడా దాచిపెట్టలేదు. కానీ గతంలో తన రిలేషన్స్ గురించి బయట పెట్టలేదు. ఈ విషయం పై తాజాగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
అదేంటంటే తమన్నా విజయ్ వర్మ ( Vijay varma ) కన్నా ముందే మరో ఇద్దరు స్టార్ హీరోలతో రిలేషన్ లో ఉందని వార్త వినిపిస్తుంది. తమిళ హీరో కార్తీ ( Karthi ) తో గతంలో ఈమె రిలేషన్ లో ఉందట.. ఆ విషయం అప్పటిలో తమిళ మీడియాలో ఓ రేంజులో వినిపించింది. ఏది దాచుకొని తమ్మూ ఈ విషయం బయటపెట్టలేదు. పెళ్లి వరకు తీసుకెళ్లాలని అనుకుంది. కానీ అది బెడిసి కొట్టింది. దాంతో సైలెంట్ అయ్యింది. తాజాగా రాజ్ షమణి కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా షాకింగ్ కామెంట్లు చేసింది. నా హృదయం రెండుసార్లు ముక్కలైంది. రెండుసార్లు నాకు లవ్ బ్రేకప్ అయ్యింది అని తమన్నా మాట్లాడిన మాటలు చాలామందిని ఎమోషనల్ గా కట్టిపడేసాయి.
కార్తీ కన్నా ముందు ఓ అబ్బాయిని ప్రేమించిందట.. అది కూడా విడిపోయింది. టీనేజ్ లో ఉన్నప్పుడు ఓ వ్యక్తితో ప్రేమలో పడ్డాను. కానీ ఆ వ్యక్తి నా లక్ష్యానికి అడ్డయ్యాడు. నా మనస్సాక్షిని చంపుకొని ఆయనతో ప్రేమను కంటిన్యూ చేయలేకపోయాను. అందుకే బ్రేకప్ చెప్పేసాను. ఇక మరోసారి కూడా ఓ వ్యక్తితో కొద్ది సంవత్సరాలు రిలేషన్ లో ఉన్నాను. కానీ ఆ రిలేషన్ అబద్దాలతో కొనసాగడం నాకు నచ్చలేదు. అందుకే విడిపోయినట్లు చెప్పేసింది. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక ఇప్పుడు బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉంది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని టాక్.. ఇక ఇద్దరు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.