Sunil : తెలుగు ప్రేక్షకులకు కమెడియన్ సునీల్ (Sunil )పేరంటే తెలియకుండా ఉండదు. ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న ఈయన ఆ తర్వాత హీరోగా మారి పలు హిట్ సినిమాల్లో నటించి అందరి మెప్పును పొందాడు ఆ సినిమాలు అన్ని మంచి హిట్ టాక్ ను అందుకున్నాయి. సినిమాలు హిట్ అయినా హీరోగా పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక విలన్ గా తనలోని మరోకోణాన్ని బయటపెట్టారు. పుష్ప లాంటి పాన్ ఇండియా మూవీలలో సునీల్ విలన్ గా మెప్పించాడు. ఇక సునీల్ గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటపడింది. అదేంటో ఒకసారి తెలుసుకుందాం..
కమెడియన్స్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హీరోలుగా విలన్ లుగా మారతారు.ఇక అలాంటి వారిలో ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ విలన్ గా దూసుకుపోతున్న సునీల్ ని ఉదాహరణకు తీసుకోవచ్చు. ఇక సునీల్ ఇండస్ట్రీకి ఒక కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇక అప్పట్లో ఈయన కామెడీకి ఫ్యాన్స్ ఎక్కువగానే ఉన్నారు. అందుకే సునీల్ సినిమా వస్తుందని అంటే హంగామా వేరే రేంజులో ఉండేది. ఇక సునీల్ కు ఓ యాంకర్ తో రిలేషన్ ఉంధనే వార్తలు అప్పటిలో హాట్ టాపిక్ అయ్యింది.
ఆ వార్తలు వచ్చిన యాంకర్ మరెవ్వరో కాదు. ఆ సీనియర్ యాంకర్ ఎవరంటే ఝాన్సీ (Jhansi).. సునీల్, ఝాన్సీ ఇద్దరు కలిసి జగపతిబాబు (Jagapathi Babu ), ప్రియమణి ( Priyamani )హీరో హీరోయిన్గా చేసిన పెళ్లయిన కొత్తలో మూవీ లో హస్బెండ్ అండ్ వైఫ్ గా చేశారు.ఈ సినిమా చేసినప్పటి నుండి సునీల్ ఝాన్సీ మధ్య ఏదో బాండింగ్ ఉంది అనే వార్త మీడియాలో వైరల్ అయింది. ఇక ఈ సినిమా తర్వాత కూడా కొన్ని సినిమాల్లో వీరు జోడి కనిపించారు.దాంతో సునీల్, ఝాన్సీ మధ్య ఎన్నో రూమర్స్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. కానీ ఈ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదు అని వీళ్లిద్దరు కొట్టి పారేశారు. ఇక మీడియాలో వచ్చే రూమర్స్ కు భయపడి వీరిద్దరూ కలిసి నటించడం కూడా మానేశారు,,
ఇక సునీల్ కెరీర్ విషయానికొస్తే.. రాజమౌళి (Rajamouli ) వంటి పాన్ ఇండియా డైరెక్టర్ తో మర్యాద రామన్న వంటి సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు. అంతే కాకుండా సునీల్ నటించిన అందాల రాముడు సినిమా కూడా బ్లాక్ బస్టర్.. ఆ తర్వాత పూల రంగడు చేసాడు.. ఆ సినిమా భారీ హిట్ అవ్వడంతో ఆ తర్వాత పలు సినిమాలు చేసాడు. కానీ మొదటి రెండు సినిమాలు అందుకున్న క్రేజ్ ను అయితే అందుకోలేదు. తెలుగు తో పాటుగా తమిళ్ లో కూడా సినిమాలు చేస్తున్నాడు. జైలర్ సినిమాలోని సునీల్ పెర్ఫామెన్స్ కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇక ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు.