Viswam : మ్యాచో స్టార్ గోపీచంద్ – శ్రీను వైట్ల కాంబినేషన్ లో ప్రస్తుతం ‘విశ్వం’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ ఇద్దరూ సక్సెస్ అందుకొని పదేళ్ల పైనే అవుతుండగా, ఇప్పుడు వీళ్ళకు విశ్వం హిట్ కావడం తప్పనిసరిగా మారింది. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 90 శాతం పూర్తయిపోగా, మరికొద్ది రోజుల్లోనే మిగతా షూట్ ని కూడా పూర్తి చేసేస్తారని సమాచారం.ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన టీజర్, మంచి అంచనాలను క్రియేట్ చేయగా, త్వరలో సాంగ్స్ తో ప్రమోషన్లు స్టార్ట్ చేయనున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా గురించి ఇండస్ట్రీ లో ఒక హాట్ టాపిక్ వైరల్ గా మారుతుంది. శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్న విశ్వం కథ ముందు ఓ స్టార్ హీరో దగ్గరికి వెళ్లిందట.
విశ్వం కథ ముందు ఈ సీనియర్ స్టార్ దగ్గరికి వెళ్లిందా?
యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న విశ్వం సినిమా ప్రస్తుతం షూటింగ్ ఫినిషింగ్ దశలో ఉంది. ఇదిలా ఉండగా విశ్వం సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ గాసిప్ నెట్టింట వైరల్ అవుతుంది. విశ్వం కథను ముందుగా శ్రీనువైట్ల మెగాస్టార్ చిరంజీవి దగ్గరికి తీసుకువెళ్లాడట. అయితే చిరుకి ఆ కథ పాయింట్ కూడా నచ్చిందట. కానీ అప్పటికీ ప్రస్తుతం చేస్తున్న కమిట్ మెంట్స్ వలన ఓకే చెప్పని చిరు, భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత… కం బ్యాక్ కోసం ఎదురు చూస్తున్న టైంలో ఈ స్టోరీ వినిపించిన శ్రీనువైట్ల కథకి నో చెప్పారని టాక్. పైగా శ్రీను వైట్ల ట్రాక్ రికార్డ్ కూడా అప్పటికే చాలా బ్యాడ్ గా ఉంది. ఒక ఎంటర్టైన్మెంట్ కథతో కాకుండా సీరియస్ జోనర్ లో పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొడదామని చిరు రిజెక్ట్ చేసాడని సమాచారం. దాంతో ఆ కథని చిన్నపాటి మార్పులు చేసి గోపీచంద్ కి వినిపించగా ఒకే చేసేసి వెంటనే మొదలుపెట్టేయడం జరిగింది.
హిట్టు కోసం పదేళ్ల నిరీక్షణ? ఇప్పుడైనా దక్కేనా?
ఇక శ్రీనువైట్ల – గోపీచంద్ ల కాంబోలో తెరకెక్కుతున్న ఈ విశ్వం మూవీ మంచి హీరోయిజం ఉన్న ఎలివేట్ సీన్స్ తో కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుండగా, పదేళ్లుగా ప్లాపుల్లో ఉన్న శ్రీనువైట్ల, గోపీచంద్ ఈ సినిమాతో సక్సెస్ కొడతారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అందుకే బడ్జెట్ ఎక్కువైనా, క్వాలిటీ విషయంలో తగ్గకుండా చూస్తున్నారు. అయితే థియేట్రికల్ బిజినెస్ మాత్రం అంతగా జరగడం లేదని టాక్. అందుకే ఈ సినిమా నిర్మిస్తున్న ప్రొడ్యూసర్స్ మధ్య ఈ విషయంపైనే చర్చ నడుస్తుంది. ఇక విశ్వం సినిమాని సెప్టెంబర్ లో లేదా దసరాకి రిలీజ్ చేద్దామని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.