Sreeja.. మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ.. సినీ ఇండస్ట్రీలోకి రాకపోయినప్పటికీ తన పర్సనల్ లైఫ్ వల్ల ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా 2007వ సంవత్సరంలో శ్రీజ తన ఇంటి నుంచి పారిపోయి మరీ మీడియా సపోర్టుతో శిరీష్ భరద్వాజను ప్రేమించి మరీ పెద్దలను ఎదిరించి వివాహం చేసుకుంది. ఈ తప్పు వల్ల చిరంజీవి ఇమేజ్ తో పాటు కుటుంబ ఇమేజ్ కూడా చాలా దెబ్బతినేలా చేసిందని చెప్పవచ్చు. అయితే శ్రీజ వివాహ బంధంలోకి అడుగుపెట్టి, శిరీష్ తో ఒక పాపకు జన్మనిచ్చిన తర్వాత, ఏమైందో ఏమో తెలియదు కానీ, వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చి 2011లో విడాకులు తీసుకున్నారు.
కుటుంబ పరువు తీసిన శ్రీజ..
అప్పుడు కూడా శ్రీజ గురించి చాలా రూమర్స్ వినిపించాయి. ఆ తర్వాత మళ్లీ కొన్నేళ్ళకు అంటే 2016 లో చిరంజీవి కళ్యాణ్ దేవ్ తో మళ్లీ పెళ్లి చేయగా వీరిద్దరికీ కూడా ఒక పాప జన్మించాక, వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఈ విషయం పైన ఇప్పటి వరకు అటు మెగా కుటుంబం కానీ కళ్యాణ్ దేవ్ కానీ ఏ విధంగా క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఇద్దరి కూతుర్లతో శ్రీజ తన జీవితాన్ని గడిపేస్తూ ఉన్నది. శ్రీజ ఒకవేళ ఆరోజు శిరీష్ అనే వ్యక్తి కోసం ఇంటి నుంచి వెళ్లకపోయి ఉంటే ఈరోజు ఒక స్టార్ హీరోకి భార్యగా ఉండేదట.
అల్లు అర్జున్ పెళ్లి చేసుకోవాల్సిన శ్రీజ..
ఆ స్టార్ హీరో ఎవరో కాదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. మెగా కుటుంబం, అల్లు కుటుంబానికి మధ్య మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. అలాంటి బంధాన్ని మరింత బలపరచడానికి సైతం చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజను అల్లు అర్జున్ కు ఇచ్చి మరీ పెళ్లి చేయాలనుకున్నారట ఇరువురు కుటుంబ సభ్యులు. అల్లు అరవింద్ కూడా శ్రీజ తమ కోడలు అయితే బాగుంటుందని భావించారట. కానీ శ్రీజ మాత్రం శిరీష్ తో లేచిపోయి తప్పు చేయడం వల్ల అల్లు అర్జున్ భార్య కాలేక పోయింది.
రాజకీయ నాయకుడికి అల్లుడుగా మారిన అల్లు అర్జున్..
అయితే చివరికి అల్లు అర్జున్ ప్రముఖ రాజకీయ నాయకుడు అయిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూతురిని ప్రేమించి మరీ 2011లో వివాహం చేసుకున్నారు అల్లు అర్జున్. అల్లు అర్జున్ భార్య పేరు స్నేహ రెడ్డి. అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించడమే కాకుండా భారీ బడ్జెట్ చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. ఎన్నో బ్రాండ్స్ కు కూడా అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఉన్నారు అల్లు అర్జున్.
అల్లు అర్జున్ సినిమాలు..
అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కి ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.