Samyuktha Menon.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్ (Samyuktha Menon). పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), స్టార్ హీరో రానా (Rana) మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కిన చిత్రం భీమ్లా నాయక్. ఈ సినిమాలో రానాకు భార్యగా నటించి తెలుగు తెరకు పరిచయమైంది సంయుక్త. ఇందులో తన అంద చందాలతో అద్భుతమైన నటనతో ఆడియన్స్ ను కట్టిపడేసింది. ఈ సినిమా తర్వాత అవకాశాలు తలుపు తట్టాయి.
వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు..
అంతే కాదు కళ్యాణ్ రామ్ సరసన బింబిసారా చిత్రంలో హీరోయిన్ గా నటించి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush ) తొలిసారి తెలుగులో నేరుగా నటించిన సార్ చిత్రంలో కూడా ఈమె హీరోయిన్ గా నటించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అక్కడితో ఆగకుండా మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ (Sai Dharam Tej) యాక్సిడెంట్ తర్వాత నటించిన రెండవ చిత్రం విరూపాక్ష. ఇందులో తన అద్భుతమైన నటనతో అందరిని భయపెట్టేసింది. ఒకవైపు అందాలతో మైమరిపిస్తూనే , మరొకవైపు క్షుద్ర పూజలతో భయపెట్టి ఆశ్చర్యపరిచింది. ఇంకా ఇప్పటికీ కూడా వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్న ఈమె ప్రస్తుతం నిఖిల్ నటిస్తున్న స్వయంభూ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్..
ఈ చిత్రమే కాదు ఈమె చేతిలో మరో నాలుగైదు సినిమాలు ఉన్నట్లు సమాచారం. ఇలా వరుస సినిమాలతో ఎప్పుడు బిజీగా ఉండే సంయుక్త సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా అభిమానులతో పంచుకుంటుంది. అంతేకాదు వరుస ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ నిత్యం వార్తలో నిలుస్తున్న ఈమె తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోతో ఎఫైర్ పెట్టుకుంది అంటూ హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఒక టాలీవుడ్ స్టార్ హీరో తో సంయుక్త ప్రేమాయణం కొనసాగిస్తోందనే ఒక వార్త చాలా వైరల్ అవుతోంది.
స్టార్ హీరో తో ఎఫైర్..
గత కొంతకాలంగా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని త్వరలోనే వివాహం కూడా చేసుకోవాలని అనుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఆ హీరోతో ఇది వరకే నటించిందని , ఆ హీరో అప్పటికే వివాహం కూడా చేసుకున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ హీరో భార్య ఉండగానే ఇలా ఈమెతో ఎఫైర్ పెట్టుకోవడం ఏంటి అంటూ కొంతమంది కామెంట్లు చేస్తుంటే, పెళ్లయిన వాడితో నీకు ఎఫైర్ ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ హీరో ఎవరు అనే విషయం తెలియదు కానీ ఇప్పుడు ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి . మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ సెలబ్రిటీలు స్పందిస్తే తప్ప రూమర్స్ కి బ్రేక్ పడవు అని చెప్పవచ్చు.