GOAT : విజయ్ చివరి సినిమాలో మెయిన్ లీడ్ గా ఆ స్టార్ హీరోయిన్.. మరి మిగతా ఇద్దరు?

GOAT : కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ ప్రస్తుతం ది గ్రేటెస్ట్ అఫ్ అల్ టైం అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై కోలీవుడ్ లోనే కాదు, సౌత్ ఇండియా అంతటా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. లియో వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ నటిస్తున్న సినిమా కావడంతో భారీ క్రేజ్ నెలకొని ఉండగా, విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే ముందు ఇదే చివరి సినిమా అని చెప్పడంతో ఈ సినిమాపై దళపతి అభిమానులు బాగా ఆశలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా నుండి వస్తున్న అప్డేట్స్ కూడా సెన్సేషన్ అవుతున్నాయి. అలాగే ఆ మధ్య గోట్ నుండి విజయ్ బర్త్ డే స్పెషల్ గా రిలీజ్ చేసిన గ్లిమ్ప్స్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అలాగే విడుదలయిన రెండు లిరికల్ సాంగ్స్ కూడా మంచి టాక్ తెచ్చుకున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా గురించి వస్తున్న తాజా వార్త కోలీవుడ్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

Samantha as the main lead in Vijay's GOAT movie

గోట్ లో హీరోయిన్ గా సామ్?

ఇక తాజాగా గోట్ (GOAT) సినిమా నుండి ఒక అప్డేట్ కోలీవుడ్ లో తెగ వైరల్ అవుతుంది. గోట్ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. అంతే కాదు ఈ సినిమాలో ఆమెనే మెయిన్ హీరోయిన్ అట. కానీ ఈ సినిమాలో ఇంతకు ముందే మెయిన్ హీరోయిన్ మీనాక్షి చౌదరి అని వార్తలు వచ్చాయి. పైగా ఈమెతో పాటు మాళవిక శర్మ, పార్వతి నాయర్ కూడా హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారట. వీళ్ళే కాక్ సీనియర్ హీరోయిన్ స్నేహ కూడా ఈ సినిమాలో నటిస్తుందట. కానీ మెయిన్ హీరోయిన్ గా ఇప్పుడు సమంత ని తీసుకున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఇది నిజమైతే మరి మిగతా హీరోయిన్లు ఏ పాత్రల్లో నటిస్తున్నారన్న ప్రశ్న తలెత్తుతుంది. మరి దీనిపై మేకర్సే క్లారిటీ ఇస్తే గాని తెలీదు.

- Advertisement -

భారీ క్యాస్టింగ్ తో గోట్..

ఇక ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా రిలీజ్ కాబోతుంది. కాగా ఈ సినిమాలో జయరామ్, స్నేహ, లైలా, యోగిబాబు, వీటీవీ గణేష్, అజ్మల్ అమీర్, మైక్ మోహన్, వైభవ్, ప్రేమి, అజయ్ రాజ్, అరవింద్ ఆకాష్, ప్రశాంత్, ప్రభుదేవా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అర్చన కల్పాతి, కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పతి ఎస్ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇక విజయ్ నటిస్తున్న ది గోట్ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ 5న సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ కంఫర్మ్ చేసారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు