పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తోన్న లేటెస్ట్ సినిమా సలార్. కెజిఎఫ్ ఫెమ్ ప్రశాంత నీల్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్న విషయం అందరికి తెలిసిందే. సెప్టెంబర్ 28 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వాల్సి ఉండిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం అవడం వల్ల రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేసుకుంది. అయితే ఈ విషయాన్నీమేకర్స్ చాలా రోజుల సస్పెన్స్ తరువాత సలార్ వాయిదా పడిందని అఫీషియల్ గా ఎనౌన్స్ చేసారు.
అయితే సలార్ సినిమా సెప్టెంబర్ లో వస్తుందని ఇతర ఇండస్ట్రీలలో చాలా సినిమాలు తమ రిలీజ్ డేట్స్ ను సలార్ సినిమాకు రెండు వారాల ముందు కొన్ని సినిమాలు, సలార్ తరువాత కొన్ని సినిమాలు రిలీజ్ చేయాలనీ ఆయా సినిమాల దర్శక నిర్మాతలు తమ సినిమాల రిలీజ్ డేట్ లను మార్చుకున్నారు. అయితే సడన్ గా సలార్ పోస్ట్ పోన్ అవడంతో ఒక్కసారిగా మళ్ళీ అన్ని సినిమాలు సలార్ రిలీజ్ డేట్ తో థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అయ్యాయి. అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది. ఇక లేటెస్ట్ గా నిన్నసాయత్రం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ భార్య తన ఇంస్టాగ్రామ్ లో ఇండైరెక్ట్ గా సలార్ సినిమా డిసెంబర్ లో రాబోతున్నట్టు ప్రకటించింది. దాంతో సోషల్ మీడియా అంత ఒక్కసారిగా అలర్ట్ అయ్యింది. సలార్ సినిమా డిసెంబర్ 22 న రిలీజ్ అవబోతుందని సోషల్ మీడియా మిమ్స్ వేస్తూ హల్చల్ చేసారు
Read More: Prabhas : సమ్మర్ లో ?
మరో పక్క సలార్ సినిమాను కొన్న డిస్టిబ్యూటర్స్ కూడా సలార్ డిసెంబర్ లోనే రాబోతుందని చెప్పడంతో సోషల్ మీడియా కథనాలకు మరింత బలం చేకూరినట్టయ్యింది. అయితే సలార్ రిలీజ్ డేట్ విషయంపై మేకర్స్ ఇప్పటి వరకైతే ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ ప్రస్తుతం టాలీవుడ్ లో సలార్ అన్ అఫీషియల్ రిలీజ్ డేట్ వల్ల డిసెంబర్ 22, 23 తేదీలలో రిలీజ్ అవ్వబోతున్న హాయ్ నాన్న, వెంకటేష్ సైంధవ్ సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలు సలార్ రిలీజ్ డేట్ డిసెంబర్ కు మారడంతో తమ సినిమా రిలీజ్ డేట్స్ ను పోస్ట్ పోన్ చేసుకొనడానికి ప్లాన్ చెస్తున్నారట. ఇప్పటికే సైంధవ్ జనవరి కి షిఫ్ట్ చేయడానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారట. అయితే ఒకవేళ సలార్ టీం ఉన్నట్టుండి సినిమా రిలీజ్ డేట్ ను మళ్లీ మారిస్తే మాత్రం మీడియం, చిన్న బడ్జెట్ సినిమాలు ఇబ్బంది పడటం తప్పదనే చెప్పాలి. మొత్తంగా చూస్తే సలార్ దెబ్బకు మిగితా సినిమాలన్నీ రిలీజ్ డేట్స్ విషయంలో క్లారిటీ లేకుండా పోతుంది.
Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify
Read More: రాజమౌళి సినిమాలో ”రహస్య గూఢచారి”గా మహేష్..!
అక్కినేని వారసుడు నాగచైతన్య గురించి తెలుగు...
శృంగార తార షకీల గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు...
మాలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు హీరో...
చాలామందిలో ఏవో ఒక అనారోగ్య సమస్యలు సర్వసాధారణంగా...
టాలీవుడ్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది...