Saiee Manjrekar : టాలీవుడ్ లో ‘గని’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ ‘సాయి మంజ్రేకర్’. అయితే తొలి సినిమా ప్లాప్ అయినా మాలి సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది ఈ బ్యూటీ. అడవి శేష్ నటించిన “మేజర్” సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్న ఈ అమ్మాయి, ఆ తర్వాత మళ్ళీ సక్సెస్ అందుకోలేదు. బాలీవుడ్ లో ముందుగా స్టార్ కిడ్ గా సినీ బ్యాక్ గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అక్కడ వరుస సినిమాలు చేసినా సక్సెస్ అందుకోలేదు. ఇక తెలుగులో కంటే ముందే బాలీవుడ్ లో దబాంగ్ 3 సినిమాతో హీరోయిన్ గా లాంచ్ అయినా ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించగా, తెలుగులో లాస్ట్ ఇయర్ స్కంద లో నటించింది. ఈ సినిమాపై సాయి మంజ్రేకర్ చాలా ఆశలు పెట్టుకుంది. కానీ సినిమా మాత్రం డిజాస్టర్ అయింది. ఇక బాలీవుడ్ లోనే ఎదో నెట్టుకొద్దామని వెళ్ళింది. కానీ అక్కడ టాలీవుడ్ కంటే దారుణంగా బోల్తా పడింది.
కూతురి కోసం ఆ డైరెక్టర్ మళ్ళి మెగాఫోన్ పడతాడా?
ఇక ఈ ఇయర్ సాయి మంజ్రేకర్ బాలీవుడ్ లో కుచ్ ఖట్టా హో జాయే, ఆరోన్ మే కహా దమ్ థా అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. కానీ ఈ రెండు సినిమాలు కూడా డిజాస్టర్ అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇతర భాషల్లో ఛాన్సులు రావడం కూడా గగనమైపోయింది. దీంతో ఈ అమ్మాయి కోసం తన తండ్రి మళ్ళీ మెగా ఫోన్ పట్టనున్నాడని తెలుస్తుంది. సాయి మంజ్రేకర్ తండ్రి మహేష్ మంజ్రేకర్ అని తెలిసిందే. విలక్షణ నటుడిగా బాలీవుడ్, టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న, ఈయన డైరెక్టర్ కూడా అని చాలా తక్కువ మందికే తెలుసు. బాలీవుడ్ లో అప్పట్లోనే వాస్తవ్, మరాఠీ లో నట సామ్రాట్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించాడాయన. ఒక పక్క నటుడుగా సినిమాలు చేస్తూనే, మరోపక్క దర్శకుడిగా కూడా అప్పుడప్పుడూ సినిమాలు చేస్తున్నాడు.
ఈ క్రమంలో వరుస ప్లాప్ లతో ఇబ్బంది పడుతున్న కూతురు సాయి మంజ్రేకర్ ని హీరోయిన్ గా పెట్టి త్వరలో మహేష్ మంజ్రేకర్ సినిమా తెరకెక్కించనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇటు సాయి మంజ్రేకర్ కూడా తన తండ్రితో కలిసి వర్క్ చేయాలనీ ఎప్పట్నుంచో ఉందని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ఓ బాలీవుడ్ ఇంటర్వ్యూ లో నెక్స్ట్ ఇయర్ డాడ్ తో సినిమా చేస్తున్నానని కూడా చెప్పింది. ఇక ఇప్పుడు సినిమాల్లేక, ప్లాపుల్లో ఉన్న కూతురికోసం మహేష్ మంజ్రేకర్ డైరెక్టర్ గా ఓ సినిమా తీయనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మించనున్నాడని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలపై మహేష్ మంజ్రేకర్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది.