RC 17: చిరుత సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. రామ్ చరణ్ కెరియర్ లో ఎన్నో అద్భుతమైన హిట్ సినిమాలు ఉన్నాయి. అయితే మొదటి సినిమాతోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని చిరు తనయుడు అనిపించుకున్నాడు. తన యాక్టింగ్ తోను డాన్స్ పర్ఫామెన్స్ తోను మెగా ఫ్యాన్స్ కి ఒక హోప్ ఇచ్చాడు. ఇకపోతే చరణ్ నటించిన రెండో సినిమా మగధీర ఈ సినిమా సృష్టించిన రికార్డ్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా అప్పట్లో ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్ సృష్టించింది.
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా చాలామంది ఆడియన్స్ ను సప్రైజ్ చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లో ఉన్న ప్లస్ పాయింట్స్ అన్నిటిని అద్భుతంగా వాడి ఆ సినిమాని హిట్ దిశగా మలిచాడు రాజమౌళి. అక్కడితో చరణ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. మగధీర తర్వాత చేసిన ఆరెంజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. అప్పటికే ఆరెంజ్ సినిమా పాటలు అద్భుతంగా హిట్ అవడంతో ఈ సినిమా మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. కానీ అంచనాలను ఆరెంజ్ సినిమా అందుకోలేకపోయింది.
ఇకపోతే చరణ్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంటే రంగస్థలం అని చెప్పొచ్చు. చరణ్ పరిపూర్ణమైన నటుడిని బయటికి తీసిన సినిమా రంగస్థలం. రంగస్థలం సినిమాతో సుకుమార్ లోని ఒక కొత్త దర్శకుడు కూడా బయటకు వచ్చాడు. అప్పటివరకు క్లాస్ మూవీస్ తీసే సుకుమార్ ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ పొలిటికల్ డ్రామాని అద్భుతంగా వెండితెరపై తెరకెక్కించాడు. ఈ సినిమాతో సుకుమార్ ఎనలేని కీర్తిని సంపాదించాడు. ఇకపోతే ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సాధించుకున్నాడు రామ్ చరణ్ తేజ్. ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్ చేయబోయే సినిమా గ్లోబల్ లెవెల్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ఆల్రెడీ మొదలుపెట్టేశారు. సీనియర్ రైటర్స్ అంతా కలిసి ఈ సినిమా పనులు ప్రారంభించారు.
ఇకపోతే చరణ్ కి రంగస్థలం సినిమా తర్వాత ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది అని చెప్పొచ్చు. ఆ సినిమా తర్వాత ట్రిపుల్ ఆర్ అనే సినిమాలో నటించాడు రామ్ చరణ్. ఇక్కడితో గ్లోబల్ స్టార్ అయిపోయాడు చరణ్. అయితే చరణ్ ఇప్పుడు మళ్లీ సుకుమార్ తో చేయబోయే సినిమా కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు.