Rashmika Mandanna : మెగా కంపౌండ్ లోకి కాలు పెడుతున్న రష్మిక… మరో కాజల్ అగర్వాల్ ను చేస్తారా?

Rashmika Mandanna : రష్మిక మందన్న ప్రస్తుతం టాలీవుడ్ లో నంబర్ వన్ హీరోయిన్. నిజానికి ఈ ప్లేస్ శ్రీలీలది అని అంతా అనుకున్నారు. కానీ ఇటీవల విడుదలైన ఆమె సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవడంతో, శ్రీలీలపై ఫ్లాప్ హీరోయిన్‌గా ముద్రపడింది. అయితే రష్మిక మందన్నకు మాత్రం ఇది బాగా కలిసి వచ్చింది. ప్రస్తుతం రష్మిక మందన్న టాలీవుడ్ లో టాప్‌లో కొనసాగుతోంది. అయితే తాజాగా ఈ బ్యూటీకి మెగా కాంపౌండ్ నుంచి ఆఫర్లు క్యూ కడుతుండడంతో ఆమెను మరో కాజల్ అగర్వాల్ ను చేస్తారా? అని అంటున్నారు నెటిజన్లు.

రష్మిక మందన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయి ఆమెను పాన్ ఇండియా రేంజ్ లో నంబర్ వన్ హీరోయిన్ గా నిలబెట్టాయి. గతేడాది సీతారామం, యానిమల్ వంటి సూపర్ హిట్‌లను అందించిన ఈ కన్నడ భామ రాబోయే సినిమాల లిస్ట్ కూడా పెద్దదే. మరోవైపు బాలీవుడ్‌లో కూడా బిజీగా ఉంది. తెలుగులో అల్లు అర్జున్ నటించిన పుష్ప-2, రెయిన్ బో, హిందీలో సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్‌లతో మరో రెండు సినిమాల్లో నటిస్తోంది.

Rashmika Mandanna in black dress : r/BeautifulIndianWomen

- Advertisement -

మెగా కాంపౌండ్ నుంచి ఆఫర్ల వెల్లువ

తాజాగా మరో సినిమాకు రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర చిత్రంలో రష్మిక కనిపించనుందని సమాచారం. అయితే ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష ఎంపికైంది. నేషనల్ క్రష్ రష్మికను ప్రత్యేక పాత్ర కోసం దర్శక, నిర్మాతలు సంప్రదించారని అంటున్నారు. ఈ పాత్రకు రష్మిక పేరును మెగాస్టార్ చిరంజీవి సూచించినట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవితోనే కాదు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తోనూ రష్మిక నటించనుంది. బుచ్చిబాబు, రామ్‌ చరణ్‌ కాంబినేషన్‌లో రానున్న సినిమాలో రష్మిక హీరోయిన్‌గా ఎంపికైంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. పుష్ప-2, విశ్వంభర, రామ్ చరణ్ కొత్త సినిమాల్లో నటించి మెగా హీరోయిన్ గా మారింది రష్మిక.

గతంలో కాజల్ కూడా ఇలాగే..

ఇంతకు ముందు కాజల్ అగర్వాల్ ఇలాగే వరుసగా మెగా హీరోలతో నటించింది. రామ్ చరణ్ తో మగధీర సినిమాతో మొదలు పెట్టింది కాజల్. ఆ తరువాత స్టార్ హీరోయిన్ గా మారి వరుసగా ఎవడు, నాయక్, గోవిందుడు అందరి వాడేలే వంటి సినిమాలను చెర్రీతో కలిసి చేసింది. అంతేకాదు మెగాస్టార్ తో ఖైదీ నెంబర్ 150లో రొమాన్స్ చేసింది. వీళ్లిద్దరి కంటే ముందే అల్లు అర్జున్ తో ఆర్య 2 చేసింది. ఇలా మెగా ఫ్యామిలీలో ఉన్న టాప్ 1 హీరోలందరితో సినిమాలు చేసి అప్పట్లో కాజల్ మెగా హీరోయిన్ అన్పించుకుంది. ఇప్పుడు అదే జాబితాలో చేరేందుకు రష్మిక కూడా ప్రయత్నాలు మొదలు పెట్టింది. అయితే గతంలో మెగా హీరోలతో నటించిన లావణ్య త్రిపాఠి ఇప్పుడు మెగా ఇంటి కోడలు అన్న సంగతి తెలిసిందే. అందుకే రష్మిక కూడా మెగా హీరోలతో నటించి మెగా ఇంటి కోడలు అవుతుందా అనే సందేహం మెగా అభిమానులకు ఉంది. కానీ మరోవైపు విజయ్ దేవరకొండతో ఆమె ప్రేమాయణం నడిపిస్తోంది అనే రూమర్లు కూడా ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు