Rashmi Gautam.. ఒరిస్సా కు చెందిన ఈ అమ్మాయి తెలుగు సరిగ్గా రాకపోయినా, తన మాటతీరుతో అంద చెందాలతో, గ్లామర్ తో బుల్లితెర ప్రేక్షకులలో మంచి పేరు సొంతం చేసుకుంది. ఆమె ఎవరో కాదు ప్రముఖ బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్. జబర్దస్త్ షో ఈమెకు మరింత పాపులారిటీ అందించింది. ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి షోలలో కూడా యాంకర్ గా వ్యవహరిస్తోంది. నిజానికి జబర్దస్త్ కార్యక్రమానికి అనసూయ యాంకర్ గా వ్యవహరించేది.
అనసూయ స్థానాన్ని భర్తీ చేసిన రష్మీ..
రెండేళ్ళ క్రితం జబర్దస్త్ కి అనసూయ గుడ్ బై చెప్పడంతో ఆస్థానాన్ని కొన్నాళ్లు రష్మి ఫుల్ ఫీల్ చేసింది. ఒకవైపు ఎక్స్ట్రా జబర్దస్త్, జబర్దస్త్ రెండు నిర్వహించడం కష్టంగా భావించిన ఈమె నిర్వాహకులకు చెప్పడంతో జబర్దస్త్ నుంచి ఆమెను తప్పించి, ఆ ప్లేస్ లో సౌమ్యరావు ను తీసుకొచ్చారు. అయితే ఆమె కూడా ఎక్కువకాలం ఇమడలేకపోయింది. ఆ తర్వాత సిరి హనుమంతు వచ్చినా సరే సక్సెస్ కాలేదు. ఇక దాంతో అటు జబర్దస్త్ ఇటు ఎక్స్ ట్రా జబర్దస్త్ రెండింటినీ ఒకప్పుడు హ్యాండిల్ చేసింది. కానీ కొన్ని కారణాలవల్ల ప్రస్తుతం రెండింటిని మెర్జ్ చేసి జబర్దస్త్ పేరిట ఒకే షోని నిర్వహిస్తున్నారు నిర్వహకులు.
సుధీర్తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ అదుర్స్..
ఇకపోతే జబర్దస్త్ లోకి రాకముందు వెండితెరపై కూడా అలరించింది ఈ ముద్దుగుమ్మ. హీరోయిన్గా పలు చిత్రాలలో నటించినా పెద్దగా ఈమె కెరీర్ కు ఉపయోగపడలేదు. ఒకానొక దశలో హీరోయిన్గా నటించినా జనాల్లోకి వెళ్ళలేదు.. కానీ ఆఫర్లు మాత్రం క్యూ కట్టాయి. ఇక అలా రష్మీ హీరోయిన్ గా నటించిన ఎన్నో చిత్రాలు విడుదలయ్యాయి. కానీ ఈమెకు అంతస్థాయిలో గుర్తింపు లభించలేదు. ఇకపోతే మరొకటి రష్మి గౌతమ్ కి ఫేమ్ తీసుకొచ్చిన అంశాలలో సుడిగాలి సుదీర్ తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ కూడా ఒకటి. వీరిద్దరూ కలిసి జబర్దస్త్ , ఢీ షోలో వేదికగా అద్భుతమైన కెమిస్ట్రీ కురిపించారు. ఏళ్ల తరబడి జంటగా బుల్లితెర ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేశారు. ఒకటికి రెండుసార్లు మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ వీరికి పెళ్లి కూడా చేసేసిందండోయ్. అందుకే వీరిద్దరూ నిజజీవితంలో కూడా పెళ్లి చేసుకుంటే చూడాలని అభిమానులు సైతం ఎదురుచూస్తూ ఉంటారు. నిజానికి వీరిద్దరికి కెమిస్ట్రీ చూసి వీరిద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు వినిపించాయి. కానీ తమ మధ్య స్నేహం మాత్రమే ఉంది అంటూ చెప్పుకొచ్చారు.
పెళ్లికి హింట్ ఇచ్చిన రష్మీ..
ఇదిలో ఉండగా నిత్యం గ్లామరస్ ఫోటోషూట్స్ తో ఇంస్టాగ్రామ్ లో సందడి చేసే ఈమె తాజాగా ఒక పోస్ట్ పెట్టింది. కొత్త జ్ఞాపకాలకు కొత్త ఆరంభం అంటూ కామెంట్ జోడించడంతో రష్మీ తన పెళ్లి గురించి హింట్ ఇచ్చిందంటూ నెటిజన్స్ భావిస్తున్నారు. అంతేకాదు పెళ్లి చేసుకోబోతున్నారా..? అయితే ఆ అబ్బాయి ఎవరు..? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే రష్మీ నిజంగానే పెళ్లి చేసుకోబోతోందా అనే పూర్తి వివరాలు తెలియాలి అంటే ఈమె నోరు విప్పక తప్పదు.
View this post on Instagram