Ramayana : యష్ త్వరలోనే తాను నిర్మిస్తున్న రామాయణం సినిమాతో రావణుడిగా కొత్త అవతారం ఎత్తబోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఆయనకు రావణుడి గెటప్ వేయకముందే కష్టాలు మొదలయ్యాయి అని తెలుస్తోంది. అసలు రామాయణం విషయంలో ఏం జరుగుతోంది? అనే విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.
యష్ రావణుడిగా మారే టైమ్ ఇదే
రామాయణం ఆధారంగా ఇప్పటికే చాలా సినిమాలు, సీరియల్స్ వచ్చాయి. అయితే ప్రతి సంవత్సరం కొత్త ప్రయత్నాలు జరుగుతున్నాయి. అత్యంత భారీ బడ్జెట్ తో భారతీయ ఇతిహాసాల కారణంగా రామాయణం చిత్రానికి నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. రణబీర్ కపూర్, సాయి పల్లవి సీత, రాముడిగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన హీరో హీరోయిన్ల లుక్స్ లీక్ అవ్వడంతో కొన్నిరోజుల క్రితం తెగ వైరల్ అయ్యాయి. కన్నడ స్టార్ హీరో యష్ కూడా ఇందులో నటిస్తూనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. కానీ ఈ సినిమా సెట్‌లో యష్ ఎప్పుడు జాయిన్ అవుతాడు అనే ప్రశ్న మాత్రం యష్ అభిమానుల మనసులను తొలిచేస్తోంది. తాజాగా ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది. డిసెంబర్ నాటికి యష్ ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు అని సమాచారం.
రామాయణంకు అడ్డుగా సొంత సినిమా
నిజానికి రామాయణంలో యష్ రావణుడి పాత్రను చేయడానికి ఆయన సొంత సినిమానే అడ్డుగా నిలవడం విశేషం. యష్ ప్రస్తుతం హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పుడు బెంగళూరు శివార్లలో షూటింగ్ జరుగుతోంది. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇంకా చాలా షెడ్యూల్స్ మిగిలే ఉంది. ఆ గ్యాప్ లోనే ఆయన ‘రామాయణం’ షూటింగ్ లో కూడా పాల్గొంటారని సమాచారం. ఈ మూవీ షూటింగ్ ముంబైలో జరుగుతోంది. డిసెంబర్ నాటికి యష్ ఈ సినిమా సెట్స్‌లో జాయిన్ అవుతాడు. అంటే త్వరలోనే యష్ రావణుడిగా కనిపించనున్నాడు. కానీ ఈ పాత్రకు యష్ ఎలా ప్రిపేర్ అవుతాడనే కొత్త ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది. అయితే దానికి కూడా సమాధానం ఉంది. ఇప్పటికే రామాయణం కోసం యష్ కు చాలా లుక్ టెస్ట్స్ చేశారు. ఇందులో యష్ పాస్ అయ్యాడు. కాబట్టి షూటింగ్ కు పెద్దగా అడ్డంకులు ఎదురు కాకపోవచ్చు. అయితే హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ‘బోర్డర్ 2’ సినిమాలో నటిస్తున్నాడు. రావణుడు అంటే ముందు గుర్తొచ్చేది లంకను తగలబెట్టిన హనుమంతుడు. వీరిద్దరి కాంబినేషన్ లో ఉండే సీన్లను బోర్డర్ 2 సినిమా షూటింగ్ అయ్యాక స్టార్ట్ చేయనున్నారు. సమాచారం ప్రకారం ‘రామాయణం’ సిరీస్ 2026లో విడుదల అవుతుంది. అనేక దశల్లో సినిమా రూపొందుతోంది. కాబట్టి అన్నీ అడ్డంకులను చిత్రబృందం దాటుతుందని యష్ అభిమానులు నమ్ముతున్నారు.