Niharika Konidela : మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. విడాకుల తర్వాత సోషల్ మీడియాలో మెగా డాటర్ ట్రెండింగ్ లో ఉంది. కొత్తగా నిర్మాణ సంస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. పింక్ ఏలిఫెంట్ అనే బ్యానర్ పై కొత్త సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. నిహారిక నిర్మాతగా చేసిన కమిటీ కుర్రోళ్లు సినిమాతో మొదటి సారిగా బాక్సాఫీస్ వద్దకు వచ్చింది. ఈ చిత్రానికి ఫుల్ పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి. గత వారం నుంచి ఈ సినిమా గురించి ఓ రేంజులో ట్రెండ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం నిహారిక ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్స్ ఓ రేంజులో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్బంగా ఆమె చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.
తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిహారిక తన ఫ్యామిలీ గురించి బాగానే చెబుతూ వస్తుంది. రైమ్ గురించి చెప్పిన మాటలు, క్లీంకార గురించి చెప్పిన సంగతులు, ఫాదర్ డాటర్ రిలేషన్ అంటూ రామ్ చరణ్ క్లీంకార గురించి చెప్పిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. అలాగే క్లింకార వచ్చిన తర్వాత బాగా కలిసి వస్తుందని చెబుతుంది. తను ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత ఏం జరిగాయో అన్ని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇక ఇదే క్రమంలో నిహా తన అన్న రామ్ చరణ్ పరువును అడ్డంగా తీసేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ టాపిక్ అవుతుంది.
రామ్ చరణ్ పరువును అడ్డంగా తీసేసిన నిహారిక..
రామ్ చరణ్ గురించి బాగానే చెప్పిన ఆమె అన్న గురించి ఒక సీక్రెట్ ను బయట పెట్టింది. సినిమాలతో బిజీగా ఉండటం వల్ల రామ్ చరణ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడని చెప్పింది. చెర్రీతో పోలిస్తే ఉపాసననే యాక్టివ్ గా ఉంటుందని ఆమె పై ప్రశంసల వర్షం కురిపిస్తుంది. ఉపాసన అయితే సోషల్ మీడియా యాక్టివ్ నెస్లో టాప్ మోస్ట్ అని తెలిపింది. చిరంజీవి గారు అయితే ఎక్కడికి వెళ్లినా వెంటనే పోస్ట్ చేస్తుంటారని నిహారిక చెప్పుకొచ్చింది. పవన్ కళ్యాణ్ అసలు సోషల్ మీడియానే పట్టించుకోడని, లీస్ట్ యాక్టివ్ అంటే బాబాయ్ అని చెప్పేసింది. అత్యంత తక్కువగా చెర్రీ ఉంటాడని చెప్పింది. మెగా ఫ్యామిలీలో ఎక్కువగా తానే సోషల్ మీడియాను వాడుతానని చెప్పింది. ఇక నిహారిక నిర్మాతగా కమిటీ కుర్రాళ్లు అనే సినిమా చేసింది. ఆ సినిమా సక్సెస్ ను అందుకున్నట్లే తెలుస్తుంది.