Pushpa 2 Item Song : ఐటెం సాంగ్ షూటింగ్‌కి ముహూర్తం ఫిక్స్… ఎవ్వరూ ఊహించని హీరోయిన్ ఎంట్రీ

Pushpa 2: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు సుకుమార్ ఒకరు. ఆర్య సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన సుకుమార్ తన కెరియర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలను అందించాడు. అయితే సుకుమార్ కెరియర్ లో డిజాస్టర్ సినిమాలు కూడా ఉన్నాయి. కానీ ఏ దర్శకుడికి లేని రెస్పెక్ట్ ఆ డిజాస్టర్ సినిమాల వలన సుకుమార్ కు వచ్చింది అని చెప్పొచ్చు. సుకుమార్ ఫెయిల్యూర్ కూడా ఒక డిగ్నిటీ ఉంటుంది. ఇకపోతే ఆర్య సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకి తెలియనిది కాదు. ఆ సినిమాలో ఆ అంటే అమలాపురం అనే పాట అప్పట్లో ఒక సంచలనం అని చెప్పాలి. వాస్తవానికి ఆ పాట పెట్టడం సుకుమార్ ఇష్టం లేదట. కానీ సుకుమార్ ఒకటనుకుంటే ఆ సినిమాలో ఈ రకంగా ఆ పాట వచ్చిందట.

Allu Arjun

ఆ సినిమా నుంచి మొదలైన సుకుమార్ సినిమాలో ఐటమ్ సాంగ్ ఇప్పటివరకు వస్తూనే ఉంది. సుకుమార్ ప్రతి సినిమాలో ఐటెం సాంగ్ కి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఆ ఐటెం సాంగ్ తర్వాత సినిమా ఇంకొంచెం సీరియస్ గా నడవడం మొదలవుతుంది. జగడం, నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో వంటి సినిమాల్లో కూడా మనం ఐటెం సాంగ్స్ గమనించవచ్చు. ఇకపోతే సుకుమార్ కెరియర్ లో బెస్ట్ ఫిలిం అని చాలామంది రంగస్థలం అని చెబుతారు. ఆ సినిమాలో కూడా పూజా హెగ్డే తో జిగేల్ రాణి పాటకి స్టెప్పులు వేయించాడు సుకుమార్.

- Advertisement -

రీసెంట్గా సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమా పుష్ప ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం ఏకంగా సమంతాను తీసుకొచ్చాడు. ఇప్పుడు ప్రస్తుతం పుష్ప టు కోసం ఐటెం గాళ్ ను వెతికే పనిలో పడ్డారట చిత్ర యూనిట్. ఇకపోతే దీనిలో ఐటెం సాంగ్ కోసం మళ్లీ సమంత , జాన్వి కపూర్, ఊర్వశి లా పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీరు కాకుండా ఇంకొకరు కూడా చేసే అవకాశం ఉంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర అవుతున్న టైంలో ఐటెం సాంగ్ కూడా ప్లాన్ చేసే పనిలో పడ్డారట సుకుమార్ అండ్ టీం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు