Pushpa 2: అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య ఉన్న విభేదాలు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు సరైనోడు సినిమా సక్సెస్ మీట్ లో ఏ ముహూర్తాన పవన్ కళ్యాణ్ గురించి అల్లు అర్జున్ చెప్పను బ్రదర్ అని అన్నాడో అక్కడి నుంచి ఈ వివాదం మొదలైంది. అక్కడ మొదలైన ఈ వివాదం తారస్థాయికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఒక మనసు అని సినిమా ఈవెంట్లో ఈ విషయం గురించి అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చినా కూడా చాలామంది దీనిని పట్టించుకోలేదు. అల్లు అర్జున్ నటించిన డిజె సినిమా టీజర్ కి డిస్ లైక్ రావటం, ఇలా చాలా జరుగుతూ వచ్చాయి.
ఇకపోతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కూడా కీలకపాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఆంధ్రప్రదేశ్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే ఎలక్షన్లు జరుగుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ ఆపోజిట్ పార్టీ అయినా వైఎస్ఆర్సిపి కాండేట్ కి అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి సపోర్ట్ చేయడం అనేది మెగా ఫ్యామిలీలో తీవ్రమైన కలకలం రేపింది. దీని గురించి కొంత మేరకు క్లారిటీ ఇచ్చినా కూడా దీనిని కూడా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఇక రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కూడా ఒక మీటింగ్ లో మాట్లాడుతూ ఒకప్పుడు హీరో అంటే చెట్లను కాపాడేవాడు, కానీ ఇప్పుడు స్మగ్లర్లను హీరోలుగా చూపిస్తున్నారు అంటూ పుష్ప సినిమా పైన సెటైర్లు వేశారు. ఇది పవన్ కళ్యాణ్ యాదృచ్ఛికంగా అనేశారా లేదంటే కావాలనే టార్గెట్ చేశారా అనేది తర్వాత విషయం. కానీ దీని వల్ల చాలామంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు.
అల్లు అర్జున్ కొన్న ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఇప్పుడు పుష్ప సినిమాలో డైలాగ్స్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.
Pushpa 2 Dialogue :
కేశవ : ఇంత డబ్బు సంపాదిచుడవు… నెక్ట్స్ ఏం చెస్తావ్ మచ్చా..
పుష్ప రాజ్ : MLA అయి కూసుంటాను
కేశవ : ఎలా అవుతావ్ మచ్చా..
పుష్ప రాజ్ : డబ్బు ఉండాది… EVM లను కొనేస్తా మచ్చా.. అప్పుడు MLA ఏమి.. CM కాకుంటే డిప్యూటీ సీఎం అయినా అయితా…
అయితే ఈ డైలాగు నిజంగా సినిమాలో ఉంటుందో లేదో కూడా క్లారిటీ లేదు. అని కొంతమంది మాత్రం పవన్ కళ్యాణ్ ను అల్లు అర్జున్ ఈవీఎం డిప్యూటీ సీఎం అంటూ కామెంట్ చేస్తున్నాడు అని మళ్ళీ ఫ్యాన్ వార్స్ మొదలుపెట్టారు. ఏదేమైనా మెగా ఫ్యామిలీ తోపాటు అల్లు ఫ్యామిలీ కూడా ఏవైనా పండగలు జరిగిన ఈవెంట్స్ జరిగిన కలిసి కనిపిస్తూ ఉంటారు. వీరి మధ్య ఏమి విభేదాలు లేవు అంటూ చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వీటిని కొంతమంది అసలు పట్టించుకోరు. కేవలం కొంతమంది వాళ్ళని వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయ్ అంటూ వార్తలు వస్తుంటాయి.