Tollywood Producer : సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య ఎఫైర్స్ అనే మాట ఎక్కువగా వినిపిస్తున్నాయి. హీరో, హీరోయిన్లు మాత్రమే కాదు. నటులు, ప్రొడ్యూసర్ ల మధ్య కూడా ఎఫైర్ లు నడుస్తున్నాయని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఓ బడా నిర్మాత ఆర్టిస్ట్ ను శారీరకంగా వాడుకొని మోసం చేశాడనే వార్త ఆలస్యంగా వెలుగు చూసింది. జూనియర్ ఆర్టిస్ట్ ను ప్రేమ పేరుతో నమ్మించాడు. డబ్బులు ఇస్తాను, పెళ్లి చేసుకుంటాను అని మాయ మాటలు చెప్పి లోబరుచుకున్నాడు. ఆమె గర్భవతి అయ్యాక వదిలేసి విదేశాలకు వెళ్ళిపోయాడు. ఆమెకు ఇప్పుడు కొడుకు పుట్టాడు. ఇన్నాళ్లకు ఆమె అన్యాయం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో ఈ వార్త వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఆయనను ఏ క్షణమైనా అరెస్ట్ చేసేందుకు పోలీసులు రెడీగా ఉన్నారని మరోవార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..
అసలు విషయానికొస్తే.. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన బ్లాక్ బాస్టర్ అందుకున్న సినిమాను ఆ నిర్మాత నిర్మించారు. ఆ సినిమా తర్వాత పెద్దగా సినిమాలు రాలేదని తెలుస్తుంది. ఆ తర్వాత ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమా డిజాస్టర్ అయ్యింది. దాంతో ఆయన నిండా అప్పుల్లో కూరుకుపోయినట్లు సన్నిహితుల వర్గాల నుంచి సమాచారం. డిస్టిబ్యూటర్ గా చేశారు. అది కూడా ఆయన వర్కౌట్ అవ్వలేదు.. రూ. 33 కోట్లు అప్పు అకౌంట్ లో పడింది.. ఈ అప్పుల నుంచి బయట పడేందుకు ఆయన విదేశాల్లో తల దాచుకున్నారని వార్త అప్పటిలో వినిపించింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆయనకు మరో సమస్య వచ్చి పడింది. గతంలో ఓ ఆర్టిస్ట్ తో ఆయన సన్నిహితంగా ఉన్నారు. మాయమాటలు చెప్పి లోబరుచుకున్నారు. కొడుకు పుట్టిన తర్వాత ప్రొడ్యూసర్ మోహం చాటేసినట్లు తెలుసుకుంది. తన ఏడాదిన్నర బాబుతో ఆమె ఇటీవలే ఫిలిం చాంబర్ మెట్లేక్కింది. తనకు న్యాయం చెయ్యాలని ఆవేదన వ్యక్తం చేసింది.
ఏ క్షణానైన ప్రొడ్యూసర్ ను అరెస్ట్ చేసే అవకాశాలు..
నిర్మాత చేతిలో మోసపోయాను అని ఫిలిం ఛాంబర్ పెద్దల ముందు ఆమె తన గోడును వెళ్ళబోసుకుంది. వాళ్లు విచారణ జరిపారు. అసలు విషయాలను రాబట్టే ప్రయత్నాలు మొదలు పెట్టి ఆమెకు న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ విషయం పై ప్రొడ్యూసర్ కు ఫోన్ చేసి అడగ్గా ఆయన నిజాన్ని ఒప్పుకున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపించాయి. అయితే ఇప్పటికే ఆమెకు మై హోమ్ భుజాలో ఒక అపార్ట్మెంట్ ఇచ్చారని టాక్. అలాగే ప్రతి నెల 2 లక్షలు కూడా ఇస్తున్నట్లు ఫిలిం ఛాంబర్ పెద్దలకు నిర్మాత చెప్పారట.. పెళ్లి చేసుకొనే ఉద్దేశ్యం లేదని రూ. 3 కోట్లు ఇస్తానని చెప్పాడు. కానీ ఆ నటి మాత్రం రూ. 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తుందట.. అంతేకాదు డీఎన్ఎ టేస్ట్ కు తాను రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఆ నిర్మాత ఓ స్టార్ హీరో సినిమాను నిర్మిస్తున్నాడు. అందుకోసం హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది. ఆమె కేసును ఫైల్ చేసుకున్న పోలీసులు ఆ నిర్మాత ఇండియాలో అడుగు పెట్టగానే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం..