Prashant Varma : 2024 సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో హనుమాన్ (Hanu Man ) సినిమా భారీ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాదు.. బాక్సాఫీస్ షేక్ అయ్యేలా కలెక్షన్స్ కూడా రాబట్టింది. పాన్ ఇండియా హీరోల సినిమాల కన్నా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంది. ఈ మూవీలో తేజా సజ్జా (Teja Sajja ) హీరోగా నటించారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma ) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే హనుమాన్ భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ఈ మూవీకి సీక్వెల్ గా జై హనుమాన్ రాబోతుందని అనౌన్స్ చేశారు. కానీ మూవీ షూటింగ్ అప్డేట్ రాలేదు.. దీంతో ఫ్యాన్స్ అసలు ఈ సినిమా ఉందా.. లేదా అని ప్రశాంత్ వర్మపై సెటైర్స్ వేస్తున్నారు.. ఇక తాజాగా ప్రశాంత్ వర్మ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం..
ప్రశాంత్ వర్మ మూవీస్..
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తానని ప్రకటించాడు. కానీ ఆ సినిమా అప్డేట్ ఒక్కటంటే ఒక్కటి కూడా రాలేదు. ఇక దీన్ని పక్కనపెట్టి పెట్టి అనుపమ పరమేశ్వరన్ (Anuupama Parameswaran ) అక్టోపస్ సినిమా షూటింగ్ మొదలు పెట్టారు. అది పూర్తి అయ్యిందో లేదో తెలియదు కానీ రణవీర్ సింగ్ తో సినిమాను మొదలు పెట్టి ఆపేసారని అప్పట్లో వార్తలు బాగా వినిపించాయి. ఇక సింబా అనే సినిమా చేస్తున్నాడు. అటు నందమూరి బాలకృష్ణ కొడుకును ఈయన సినిమాతోనే లాంచ్ చెయ్యనున్నారు. దానికోసం బాలయ్య ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇది చాలదు అన్నట్లు ఇప్పుడు మరో లేడి ఓరియేంటెడ్ మూవీ చేస్తున్నాడని సమాచారం.. ఈ ఏడాది చివరికి ఒక్క సినిమానన్న విడుదల చేస్తారా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
రెమ్యూనరేషన్ ను పెంచేస్తున్న హనుమాన్ డైరెక్టర్..
ప్రశాంత్ వర్మ హిట్ సినిమాల గురించి అందరికీ తెలుసు.. హనుమాన్ సినిమాతో వెనక్కి తిరిగి చూసుకోలేని హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత రెమ్యూనరేషన్ ను పెంచేసాడని టాక్.. ఇక ఈయన రెమ్యూనరేషన్ విషయానికొస్తే.. ఇప్పుడు సినిమాకు మినిమమ్ కోటి లాగుతున్నాడని టాక్.. గతంలో వచ్చిన దేవకీ నందన వాసుదేవ సినిమాకు హీరో మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్ల (Asok Galla) మూవీకు కథను అందించింది… ప్రశాంత్ వర్మ. కథను అందించినందుకు గాను ప్రశాంత్ వర్మ కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నాడని టాక్.. ఇక డైరెక్టర్ గతంలో కార్తికేయ (Karthikeya ) హీరోగా గుణ 369 అనే మూవీ చేశాడు. ఆ మూవీ భారీ డిజాస్టర్ ను అందుకుంది. అటు హీరోతో గానీ, డైరెక్టర్ తో గానీ మార్కెట్ గురించి ఆలోచించితే చాలా తక్కువ.. అలాంటి మూవీకి కేవలం కథ కోసమే కోటి రూపాయలు తీసుకున్నట్లు ఇండస్ట్రీ సర్కిల్ లో టాక్..కథను అందించిన ప్రశాంత్ వర్మ.. కి హనుమాన్ తప్పా.. పెద్ద హిట్స్ ఏం లేవు. అలాంటిది ఇప్పుడు ఏ సినిమా చెయ్యాలని అన్నా కోటి ఇస్తే ఒకే లేకుంటే మాత్రం నో సినిమా అంటున్నాడని వార్తలు గత కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమేంత ఉందో తెలియాల్సి ఉంది.