PragyaJaiswal : టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్లలో “ప్రగ్య జైస్వాల్” ఒకరు. సౌత్ భామ కాకపోయినా టాలీవుడ్ సినిమాలతోనే ఎక్కువగా ఫేమస్ అయిందని చెప్పాలి. ముందుగా తమిళ్, హిందీ సినిమాల్లో నటించినా రాని గుర్తింపు తెలుగు సినిమాలతో వచ్చింది. తెలుగులో మిర్చి లాంటి కుర్రాడు అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమవగా, వరుణ్ తేజ్ కంచె సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు వచ్చింది. ఇక తొలి సినిమా భారీ విజయం సాధించకున్నా, డీసెంట్ హిట్ అనిపించుకోగా, ప్రగ్యా జైస్వాల్ కు నటన పరంగా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది. కానీ ఒక్కటి కూడా సరైన సక్సెస్ కాలేదు. అందాలు కావాల్సినంత ఆరబోసినా కూడా ఎందుకో కానీ ఈ భామకు అదృష్టం మాత్రం పెద్దగా కలిసి రాలేదు. అయితే బాలయ్యతో చేసిన “అఖండ” తో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అయినా కూడా ఆ తర్వాత అంతగా ఆఫర్లు రాకపోయే సరికి చెక్కేసింది.
అక్కడైనా ఈ బ్యూటీకి లక్ కలిసొస్తుందా?
ఇదిలా ఉండగా తెలుగులో పెద్దగా ఆఫర్లు రాకపోయేసరికి బాలీవుడ్ బాట పట్టింది ఈ అమ్మడు. హిందీలో అప్పట్లో ‘టిట్లు ఎంబిఏ’ టైటిల్ తో ఓ సినిమా చేసింది. ఇప్పుడు మళ్ళీ పదేళ్ల తర్వాత హిందీలో ఇప్పుడు ఛాన్స్ అందుకుంది. అక్షయ్ కుమార్ లీడ్ రోల్ లో తెరకెక్కిన “ఖేల్ ఖేల్ మే” చిత్రంలో ప్రగ్యా జైశ్వాల్ ఓసెకండ్ లీడ్ క్యారెక్టర్ లో నటించింది. హాలీవుడ్ మూవీ రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కగా, ఈ సినిమాలో ప్రగ్యా పాత్ర కూడా కీలకంగానే ఉండబోతోందని సమాచారం. అందుకే ఈ సినిమాపై ప్రగ్యా జైస్వాల్ ఎన్నో అసలు పెట్టుకుంది. మరి ప్రగ్యా జైశ్వాల్ కి ఈ మూవీతో బాలీవుడ్ లో ఎలాంటి బ్రేక్ వస్తుందో చూడాలి. ఇక ఈ సినిమా ఆగష్టు 15న హిందీలో రిలీజ్ అవుతుంది.
తెలుగులో బాలయ్య సినిమానే మళ్ళీ దిక్కు..
ఇక తెలుగులో అయితే ప్రగ్యా జైస్వాల్ కి మళ్ళీ ఆఫర్లు తగల్లేదు. అఖండనే చివరి సినిమా కాగా, ఇప్పడు మళ్ళీ బాలయ్య సినిమాలోనే హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం. అఖండ సీక్వెల్ లో కూడా తనే హీరోయిన్ గా ఉంటుందని వార్తలు వస్తుండగా, సెట్స్ పై ఉన్న బాబీ కొల్లి NBK109 లో కూడా ప్రగ్యానే హీరోయిన్ అని సమాచారం. ఇక ప్రగ్యా జైస్వాల్ మాత్రం ఎప్పటికప్పుడు కొత్త ఫోటోషూట్లతో డైరెక్టర్లని, నిర్మాతలని ఇంప్రెస్ చేస్తూ, సోషల్ మీడియాలో ఆకట్టుకుంటుంది. మరి ముందు ముందు ఈ బ్యూటీ లక్ ఎలా ఉండబోతుందో చూడాలి.