Prabhas : దివంగత నటులు కృష్ణంరాజు (Krishnam Raju) వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ భారీ పాపులారిటీ అందుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయిన ప్రభాస్, ఆ తర్వాత అన్నీ కూడా పాన్ ఇండియా చిత్రాలను ప్రకటిస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచుతున్నారు. సాధారణంగా ఒక సినిమా ఒక భాషలో హిట్ అయింది అంటే, ఆ హీరో ఇంకొక భాషలో కూడా సత్తా చాటే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ప్రభాస్ కూడా అదే పని చేస్తున్నాడు.
బాలీవుడ్ పై పగబెట్టిన ప్రభాస్..
ముఖ్యంగా సౌత్ ఇండియా హీరోలు అందరూ కూడా బాలీవుడ్ లో సినిమాలు చేసి తమ మార్కెట్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తే.. ప్రభాస్ మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధం అనే చెప్పాలి. మాతృభాషలోనే సినిమాలు చేస్తూ ఏకంగా బాలీవుడ్ ని టార్గెట్ చేసి అక్కడివారికి అవకాశం ఇవ్వకుండా వారిపై పగ పట్టడమే కాదు.. తనను టచ్ చేయలేనంత ఎత్తుకు ఎదిగిపోతున్నారు ప్రభాస్.
బాలీవుడ్ కోరలు పీకిన ప్రభాస్..
అసలు విషయంలోకి వెళ్తే.. మిర్చి సినిమా వరకు అసలు ప్రభాస్ అంటే ఎవరో బాలీవుడ్ కి తెలియదు. కానీ బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ ఇంటి అడ్రస్ తో సహా అందరికీ తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇండియన్ సినిమా అంటే మాదే అంటూ ఒకప్పుడు విర్రవీగిన బాలీవుడ్ కోరలను పీకింది మాత్రం ప్రభాస్ అని చెప్పవచ్చు. ఇప్పుడు సౌత్‌లో భారీ సినిమాలు వస్తున్నాయి అంటే అన్నింటికీ కారణం బాహుబలి ఇచ్చిన స్ఫూర్తి. ఒక్కో సినిమా ఒక్కో రికార్డును క్రియేట్ చేస్తూ బాలీవుడ్ కి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. బాహుబలి తర్వాత వచ్చిన కేజిఎఫ్, ఆర్ఆర్ఆర్, కాంతారా, విక్రమ్, కల్కి ఇలా అన్ని సినిమాలు కూడా గట్టిగానే వసూలు చేయడం మొదలు పెట్టేసాయి.
బాలీవుడ్ కి టార్గెట్ సెట్ చేసిన ప్రభాస్..
ముఖ్యంగా సౌత్ ఇండియా భాషలన్నీ ఏకమై బాలీవుడ్ ను ఢీ కొట్టడమే పనిగా పెట్టుకున్నాయో ఏమో అనిపిస్తుంది. అందుకు తగ్గట్టుగానే సినిమాలు విడుదల చేస్తూ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతున్నాయి. ఇకపోతే బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సాహో, రాధే శ్యామ్ సినిమాలు ఫ్లాప్ అయినా సరే ప్రభాస్ ఇమేజ్ కి ఏ మాత్రం డోకా లేదు. దీంతో ప్రభాస్ ఇమేజ్ ఎప్పటికైనా బాలీవుడ్ కి నష్టాన్ని కలిగిస్తుందని ఆలోచించిన వారు పగడ్బందీగా ఆది పురుష్ సినిమా తీసి దెబ్బ కొట్టే ప్రయత్నం చేశారని ఇఫ్పటికే ప్రభాస్ ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. దీనితో ప్రభాస్ ను అక్కడ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. కానీ అక్కడి నుంచి ప్రభాస్ రూట్ మార్చి సౌత్ డైరెక్టర్లతో సినిమాలు చేయడం మొదలుపెట్టి ఇప్పుడు మళ్ళీ వెను తిరిగి చూడకుండా దూసుకుపోతున్నారు. అందులో భాగంగానే కల్కి సినిమాతో బాలీవుడ్ కి ఒక టార్గెట్ ని సెట్ చేశారు ప్రభాస్.
ప్రభాస్ దెబ్బకు బాలీవుడ్ కోలుకుంటుందా..
ఇక ప్రభాస్ సెట్ చేసిన ఈ టార్గెట్ అందుకోవడానికి బాలీవుడ్ కి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. ఒక్కో సినిమాతో బాలీవుడ్ ను ఎక్కడానికి రూట్ మ్యాప్ కూడా రెడీ చేసుకున్నట్లు స్పష్టం అవుతోంది. అందుకే బాలీవుడ్ డైరెక్టర్లు ఇక అడిగినా సరే నిర్మొహమాటంగా చెయ్యను అని చెప్పేస్తున్నారట ప్రభాస్. ప్రస్తుతం ఈయన రాజా సాబ్, స్పిరిట్ , సలార్ 2, కల్కి 2 అంటూ అన్ని కూడా భారీ బడ్జెట్ చిత్రాలతో బాలీవుడ్ ను ఇంకా గట్టిగా తొక్కడానికి సిద్ధమవుతున్నారు. తనని టార్గెట్ చేసిన బాలీవుడ్ ను అసలు రూపురేఖలు లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నట్లున్నారు ప్రభాస్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయినా ప్రభాస్ తో సినిమా చేస్తే భయపడాల్సిన అవసరం లేదు అని నిర్మాతలు ఆలోచించేలా ఒక నమ్మకాన్ని సెట్ చేశారు ప్రభాస్. ఏది ఏమైనా ప్రభాస్ దెబ్బకు బాలీవుడ్ కోలుకుంటుందో లేదో చూడాలి.