Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సెట్స్ లో అడుగు పెట్టేది అప్పుడే, ముందు ఆ సినిమాకే ప్రాధాన్యత

Pawan Kalyan: ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించి తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2014లో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్, దాదాపు 10 ఏళ్ల పాటు శ్రమించి 2024లో అధికారంలోకి వచ్చారు. అయితే అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలకు గ్యాప్ ఇస్తానంటూ అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ వకీల్ సాబ్ అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.

వకీల్ సాబ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్(Bheemla Nayak), బ్రో(Bro) సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాలు కూడా మంచి సక్సెస్ను అందుకున్నాయి. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మూడు సినిమాలు చేయాల్సి ఉంది. వాటిలో ఓ జి, ఊస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాలు ఉన్నాయి. ఇకపోతే అందరికీ ఓజి(OG) సినిమా పైన మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దీని కారణం స్వతహాగా సుజిత్ పవన్ కళ్యాణ్ కి పెద్ద అభిమాని అవ్వడమే. గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయినప్పుడు సుజీత్ చేసిన హడావిడి అప్పట్లో వైరల్ గా మారింది.

ఓజి కోసం డేట్స్

ఓజి సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా అప్పట్లో ప్రకటించారు. అయితే షూటింగ్ ఇంకా పెండింగ్ ఉన్న కారణంగా ఈ సినిమా వాయిదా వేసారు. దీని గురించి ఇంకా అధికార ప్రకటన రాలేదు. అయితే పవన్ కళ్యాణ్ ఓజి సినిమా కోసం అక్టోబర్లో డేట్లు కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్లో ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ డేట్ చేస్తే ఇదే ఏడాదిలో ఓ జి సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇదివరకే ఈ సినిమా నుంచి రిలీజ్ అయినా, గ్లింప్స్ కూడా అద్భుతమైన రెస్పాన్స్ సాధించింది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఒక గ్యాంగ్ స్టార్ లో కనిపించబోతున్నాడు. కళ్యాణ్ ని ఈ వీడియోలో చాలా స్టైలిష్ గా చూపించాడు సుజిత్.

- Advertisement -

 

ఓజి తర్వాత ఊస్తాద్ భగత్ సింగ్

ఓజి సినిమా పూర్తయిన వెంటనే ఊస్తాద్ భగత్ సింగ్ (Usthaad Bagath Singh) సినిమాకి పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. హరి శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పైన అద్భుతమైన అంచనాలు ఉన్నాయి. దీని కారణం ఇదివరకే కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలవడం. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన వీడియో ఫుటేజ్ కూడా అద్భుతమైన అంచనాలను పెంచింది అతి తక్కువ డేస్ లో మంచి కంటెంట్ పవన్ కళ్యాణ్ నుంచి రాబట్టాడు హరీష్ శంకర్. ఇక హరీష్ శంకర్ చేసిన లాస్ట్ ఫిలిం మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కౌట్ కాలేదు.

OG Movie

ఇకపోతే ఈ రెండు సినిమాలు తో పాటు పవన్ కళ్యాణ్ చేస్తున్న మరో సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది. ఈ సినిమాకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రిమైనింగ్ పార్ట్స్ ని ప్రముఖ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించబోతున్నారు. ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఏం ఏం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు