Pawan Kalyan: ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించి తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2014లో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్, దాదాపు 10 ఏళ్ల పాటు శ్రమించి 2024లో అధికారంలోకి వచ్చారు. అయితే అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలకు గ్యాప్ ఇస్తానంటూ అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ వకీల్ సాబ్ అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.
వకీల్ సబ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్(Bheemla Nayak), బ్రో(Bro) సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాలు కూడా మంచి సక్సెస్ను అందుకున్నాయి. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మూడు సినిమాలు చేయాల్సి ఉంది. వాటిలో ఓ జి, ఊస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాలు ఉన్నాయి. ఇకపోతే అందరికీ ఓజి సినిమా పైన మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దీని కారణం స్వతహాగా సుజిత్ పవన్ కళ్యాణ్ కి పెద్ద అభిమాని అవ్వడమే. గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయినప్పుడు సుజీత్ చేసిన హడావిడి అప్పట్లో వైరల్ గా మారింది.
ఓజి సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా అప్పట్లో ప్రకటించారు. అయితే షూటింగ్ ఇంకా పెండింగ్ ఉన్న కారణంగా ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉంది. దీని గురించి ఇంకా అధికార ప్రకటన రాలేదు. అయితే పవన్ కళ్యాణ్ ఓజి(OG) సినిమా కోసం అక్టోబర్లో డేట్లు కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్లో ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ డేట్ చేస్తే ఇదే ఏడాదిలో ఓ జి సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇకపోతే నిన్ననే హరిహర వీరమల్లు షూటింగ్ స్టార్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ఈ సినిమాకి సంబంధించి చేస్తున్నారు. అయితే అతి త్వరలో పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై కొందరు స్పందిస్తూ ఓజి పక్కనపెట్టి హరిహర వీరమల్లు సినిమాకి పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత ఇస్తున్నాడు అంటూ పోస్టులు పెడుతున్నారు.