Anasuya : యాంకర్ అనసూయ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు యాంకర్ గా వరుస షోలలో మెరిసిన అమ్మడు ఇప్పుడు యాంకరింగ్ కు గుడ్ బై చెప్పేసి కేవలం సినిమాల పై మాత్రమే ఫోకస్ చేసింది. తెలుగుతో పాటుగా పలు ఇండస్ట్రీలో వరుస సినిమాలను చేస్తూ బిజీగా ఉంది. ఈ మధ్య బుల్లితెర పై కూడా మెరుస్తుంది. ఓ షోకు జడ్జిగా వ్యవహారిస్తుంది. ప్రస్తుతం సింబా అనే మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతుంది. మొన్న సినిమా ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించిన సంగతి తెలిసిందే.. ఆ ఈవెంట్ లో అను ఫ్యాన్స్ కు బంఫర్ ఆఫర్ ఇచ్చింది. అది కాస్త ఇప్పుడు వివాదాలకు తెర తీసిందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
సంపత్ నంది టీం వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్ల పై సంపత్ నంది, దాసరి రాజేందర్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మురళీ మనోహర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఆగస్టు 9 న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా అను మాట్లాడుతూ మొక్కలను నాటిన వారికి ఫ్రీగా సినిమా టిక్కెట్స్ ఇస్తున్నట్లు చెప్పారు. ఈ ఆఫర్ కొందరికి నచ్చితే.. మరికొందరు మాత్రం ట్రోల్స్ చేస్తున్నారు. అను మొక్కలు నాటితేనే ఇస్తావా? ఇంకేం చెయ్యొద్దా అని కామెంట్స్ చేస్తున్నారు.. ప్రస్తుతం ఇది నెట్టింట చర్చనీయాంశంగా మారింది. మరి దీనిపై ఫైర్ బ్రాండ్ అనసూయ ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఈ వార్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండటంతో అనసూయ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. మంచి పని గురించి చెప్పినా ఇలానే స్పందిస్తారా? కొంచెం కూడా బుద్ది కొంచెం కూడా లేదు అని కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. ఈ సినిమా నిర్మాత సినిమా తియ్యడానికి కారణాలను బయటపెట్టాడు. యాంకర్ ఉదయ భాను వల్లే సినిమాను చేస్తున్నట్లు ఆయన బయట పెట్టాడు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ఉదయభాను నన్ను ఛాలెంజ్ చేసింది. ఆ తరువాత సంతోష్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన హరితహారం గురించి తెలుసుకున్నా. అలాంటి టైంలోనే ఈ కథ విన్నాను.. మంచి మెసేజ్ ను ఇచ్చే సినిమా తప్పకుండ అందరికీ నచ్చుతుందని ఆయన అన్నారు. మరి సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో తెలియాలంటే రేపటివరకు వెయిట్ చెయ్యాల్సిందే.. అనసూయ ఒకవైపు సినిమాలు చేస్తున్నా మరోవైపు సోషల్ మీడియాలో హాట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది. ఆమె ఎప్పుడూ ఎలాంటి ఫోటోలను షేర్ చేస్తుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు. ఇక బుల్లితెరపై జడ్జిగా పలు షోలు చేస్తూ వస్తుంది. సినిమాల విషయానికొస్తే.. పుష్ప 2 సినిమాలో కూడా నటిస్తుంది. ఆ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.