Nivetha Thamous.. ఏ సినీ ఇండస్ట్రీలో నైనా సరే హీరోయిన్లు అంటే ఇలానే ఉండాలని, కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. కొంతమంది హీరోయిన్స్ స్లిమ్ అయినా భరించలేరు. అధిక బరువైనా కూడా భరించలేరు అభిమానులు.. కానీ సెలబ్రిటీలు మాత్రం ముఖ్యంగా హైట్ ,వెయిట్ , జీరో సైజ్ అంటూ ఉన్న గ్లామర్ ని సైతం చాలామంది పోగొట్టుకుంటున్న వారు కూడా ఉన్నారు. అయితే కొంతమంది హీరోయిన్స్ మాత్రం హీరోయిన్స్ అంటే ఇలానే ఉండాల్సిన పనిలేదు అనేంతగా తమ నటనతో నిరూపించారు. అలాంటివారిలో నివేదా థామస్, నిత్యామీనన్ తదితర హీరోయిన్స్ సైతం ఉన్నారు.
అనారోగ్య సమస్యలే అధిక బరువుకు కారణం..
నిత్యా మీనన్ కూడా అధిక బరువు పెరగడానికి ముఖ్య కారణం తన ఆరోగ్య సమస్యలు అన్నట్టుగా తెలియజేసింది. ఇప్పుడు తాజాగా హీరోయిన్ నివేదా థామస్ కూడా అధిక బరువు పెరగడంతో ఒకప్పుడు ఆమెను చూసిన అభిమానులు ఇప్పుడు చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ముఖ్యంగా మహిళలు సైతం వారి గుండె సమస్యల వల్లే ఇలా బరువు పెరిగిపోతారు. ఇటీవలే నివేద థామస్ నటించగా ఇప్పుడు..” 35 చిన్న కథ కాదు” అనే సినిమా ప్రమోషన్స్ లో నివేద థామస్ ను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
దాటవేసే ప్రయత్నం చేసిన నివేదా..
నివేద థామస్ బరువు పెరగడానికి ఆమెకు ఆరోగ్య సమస్యలే కారణమని కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫ్యాట్ ఎక్కువగా ఉంటే ఆహార పదార్థాలను తింటే నివేద థామస్ అధిక బరువు పెరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం పైన నివేద థామస్ ను మిత్రులు ఎంతమంది ప్రశ్నలు అడిగినా కూడా సమాధానాన్ని దాట వేస్తూ వస్తోంది. అయితే అభిమానులు మాత్రం కేవలం నివేద థామస్ ఏదో సినిమా కోసమే ఇలా బరువు పెరిగిందా అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ విషయం పైన నివేద థామస్ క్లారిటీ ఇస్తేనే తెలుస్తుంది. అభిమానులు మాత్రం నివేద థామస్ ఎలాంటి లుక్కులోనైనా సరే చాలా క్యూట్ గానే ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
నివేదా థామస్ కెరియర్..
నివేదా థామస్ విషయానికి వస్తే.. మోడల్ గా కెరియర్ మొదలు పెట్టిన ఈమె ఆ తర్వాత తెలుగు , తమిళ్, మలయాళం భాషలో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇక తెలుగులో మొదటిసారి జెంటిల్మెన్ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకుంది. నిజానికి ఈమె 2002లో ఉత్తర అనే మలయాళ చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా అరంగేట్రం చేసి, ఆ తర్వాత సన్ టీవీలో ప్రసారమయ్యే చిన్నపిల్లల సీరియల్ మై డియర్ భూతం లో కూడా నటించింది. వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె తాజాగా తెలుగులో 35 చిన్న కథ కాదు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.