Nithiin : టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కు కెరీర్ పరంగా ఏమాత్రం కలిసి రావట్లేదు. ఆయన గత చిత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ రొటీన్ గా ఉందంటూ పేక్షకులు పెద్దగా ఆదరించలేదు. కానీ అదే సినిమా ఓటీటీలో వస్తే మాత్రం ట్రెండింగ్ లో దూసుకెళ్లింది. ఇలా సినిమాల పరంగా నితిన్ కష్టాల్లో ఉన్నాడని చెప్పాలి. తాజాగా ఆయన చేయాల్సి ఉన్న ఒక కొత్త సినిమాకు కూడా ఆదిలోనే ఆర్థిక కష్టాలు ఎదురవ్వడంతో ప్రాజెక్టు చేతులు మారుతోంది అనే టాక్ నడుస్తోంది. మరి ఆ ప్రాజెక్టు ఏంటి? ఎవరి చేతుల్లో నుంచి ఎవరి చేతుల్లోకి మారుతోంది? అనే వివరాల్లోకి వెళ్తే..
ఆదిలోనే ఆర్థిక కష్టాలు
హీరో నితిన్ కు వరుస డిజాస్టర్లు పడుతున్నా అవకాశాలకు ఏమీ కొదవలేదు. ప్రస్తుతం ఆయన తమ్ముడు, రాబిన్ హుడ్ అనే రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు షూటింగ్ పరంగా చివరి దశకు చేరుకున్నాయి. అంతేకాదు అతి తక్కువ గ్యాప్ తో త్వరలోనే పేక్షకుల ముందుకు రాబోతున్నాయి. తమ్ముడు మూవీకి శ్రీరామ్ వేణు దర్శకత్వంలో వహిస్తుండగా, రాబిన్ హుడ్కి వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాల షూటింగ్ పూర్తి కావడంతో నెక్స్ట్ సినిమాలపై దృష్టి పెట్టాడు నితిన్. త్వరలో రెండు కొత్త సినిమాలు తీసే ఆలోచనలో ఉన్నాడు. అందులో ఒకటి మనం ఫేమ్ విక్రమ్ కె కుమార్ తో కమిట్ అయ్యారు. ఇప్పటికే ఆయనతో సినిమాకు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పైగా ఈ చిత్రాన్ని 80 కోట్ల బడ్జెట్తో ప్లాన్ చేశారు. నితిన్, డైరెక్టర్ విక్రమ్ గతంలో ఇష్క్ అనే బ్లాక్ బస్టర్ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. నితిన్ కెరీర్ కు ఈ మూవీ మంచి బూస్ట్ ఇచ్చింది. అందుకే మరోసారి వీరిద్దరి కాంబోలో భారీ బడ్జెట్ తో సినిమా రాబోతోంది అనగానే మూవీ స్టార్ట్ కాకముందే బజ్ మొదలైంది. ఈ ఏడాది మొదట్లో హనుమాన్ మూవీతో మంచి లాభాలు అందుకున్న నిర్మాత నిరంజన్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ను నిర్మించడానికి సిద్ధం అయ్యారు. దసరాకి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అఫిషియల్ అనౌన్మెంట్ ప్లాన్ చేసారు.
చేతులు మారిన ప్రాజెక్టు
కానీ తాజా సమాచారం ప్రకారం నిరంజన్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ నుండి ఇటీవల తప్పుకున్నారు. డబుల్ ఇస్మార్ట్ మూవీ బాక్స్ ఆఫీసు వద్ద బోల్తా కొట్టిన కారణంగా ఆయన ప్రస్తుతం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నారని అంటున్నారు. ఈ సినిమాపై రూ. 40 కోట్లకు పైగా నష్టపోయిన నిరంజన్ రెడ్డి నిర్మాతగా నితిన్ సినిమా నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడని గుసగుసలు విన్పిస్తున్నాయి. నితిన్, విక్రమ్ కుమార్ సినిమాని ఇప్పుడు మరో నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్నారని సమాచారం. అతి త్వరలో దీనిపై అనౌన్స్మెంట్ రానుంది. నవంబర్ నుండి నితిన్ ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మరోవైపు నితిన్, శాలిని దంపతులు పండంటి మగ బిడ్డకు తల్లిదండ్రులు అయిన సంతోషంలో ఉన్నారు.