Narne Nithin: ఏ సినిమా ఎప్పుడు మొదలై ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియని పరిస్థితులు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఉన్నాయి. ఇక రీసెంట్ విషయంలో మిస్టర్ బచ్చన్ సినిమా విషయానికి వస్తే. మామూలుగా హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో ఒక ప్రాజెక్టులో బిజీగా ఉన్నాడు అని అందరికీ తెలిసిందే. కానీ సడన్ గా రవితేజతో ఈలోపే ఒక సినిమా చేస్తున్నాడు అంటూ మిస్టర్ బచ్చన్ టైటిల్ రీవిల్ చేశారు. ఇక సినిమా ఆగస్టు 15న రిలీజ్ కి సిద్ధమవుతుంది. మ్యాడ్ అనే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు నార్నే నితిన్. ఈ నితిన్ మరెవరో కాదు జూనియర్ ఎన్టీఆర్ కి స్వయానా బావమరిది.
మ్యాడ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరో జాతి రత్నాలు టైప్ లో ఈ సినిమా సంచలనం సృష్టించింది. ఈ సినిమాతో మంచి పేరు సాధించుకున్నాడు నితిన్. నితిన్ ఇప్పుడు ఆయ్ అనే సినిమాలో కనిపిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్ లో మొదటి సినిమా గురించి ఒక రిపోర్టర్ అడిగినప్పుడు, ఆ సినిమా ఆగిపోయింది అంటో సమాధానం ఇచ్చాడు నితిన్. కానీ ఆ సినిమా ప్రొడ్యూసర్ మాత్రం ఆ సినిమా గురించి అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాడు. అయితే నితిన్ ఆ మాట చెప్పగానే ఈ సినిమా అసలు రిలీజ్ అవుతుందా లేదా అని ప్రొడ్యూసర్ కి భయాందోళనలు మొదలయ్యాయి.
అయితే వాస్తవానికి ఈ రెండింటి కంటే ముందు “శ్రీశ్రీశ్రీ రాజా వారు” అంటూ ఒక సినిమాను మొదలుపెట్టాడు నితిన్. ప్రముఖ దర్శకుడు సతీష్ వేగేశ్న ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను శ్రీ వేధాక్షర మూవీస్ బ్యానర్ పై చింతపల్లి రామారావు నిర్మించారు. కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రంకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచింది. అంతేకాదు సెన్సార్ సభ్యుల ప్రశంసలు కూడా అందుకుంది. ఈ సినిమాలో రావు రమేష్, నరేష్, రఘు కుంచె, ప్రవీణ్, రచ్చ రవి, సరయు, రమ్య, ప్రియ మాచిరాజు, భద్రం, ఆనంద్, జబర్దస్త్ నాగి తదితరులు నటించారు. ఈ చిత్రానికి కైలాష్ మీనన్ సంగీతం అందిస్తున్నారు. శతమానం భవతి సినిమాతో సతీష్ వేగేశ్న నేషనల్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఇప్పటికీ రిలీజ్ అవుతుందో లేదో క్లారిటీ లేకుండా పోయింది.