Nani : నేచురల్ స్టార్ నాని హ్యాట్రిక్ హిట్స్ కొట్టి, అదే జోష్ తో నెక్స్ట్ వరుస సినిమాలు చేయడానికి సిద్ధం అవుతున్నారు. అయితే ఆయన తన నెక్స్ట్ మూవీలో ఇప్పటికే రెండు సార్లు కలిసి నటించిన ఓ స్టార్ హీరోయిన్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ముచ్చట పడుతున్నారని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఆ హీరోయిన్ ఎవరు? అసలు నానితో ముచ్చటగా మూడోసారి నటించి హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధం అవుతుందా? అనేది తెలుసుకుందాం పదండి.
మూడో సారి ఆ హీరోయిన్ తో నాని రొమాన్స్
త్వరలో టాలీవుడ్ లో ఓ ఇంట్రెస్టింగ్ కాంబో రిపీట్ కాబోతోంది. నేచురల్ స్టార్ నాని అతిత్వరలో సెన్సిబుల్ ఫిల్మ్ మేకర్ శేఖర్ కమ్ములతో కలిసి పని చేయనున్నారు. శేఖర్ కమ్ముల ఇప్పటికే నాని కోసం ఒక ప్లాట్ ను రెడీ చేశారని సమాచారం. అంతేకాదు నాని ఈ ప్రాజెక్ట్ కోసం అధికారికంగా అంగీకరించాడు. ప్రస్తుతం ఈ సినిమా గురించే హీరోయిన్ల వేట సాగుతోందని తెలుస్తోంది. అయితే డైరెక్టర్ కూడా పక్కింటి అమ్మాయిలా ఉండే అందమైన హీరోయిన్ ను నానితో నటింపజేసే ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ఆమె మరెవరో కాదు హీరోయిన్ సాయి పల్లవి. నాని నెక్స్ట్ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటించడానికి చర్చలు జరుగుతున్నాయని సమాచారం. సాయి పల్లవిని హీరోయిన్ గా ఎంపిక చేసే ఆలోచనలో శేఖర్ కమ్ముల ఉన్నారని అంటున్నారు.
అందరూ బిజీనే.. ప్రాజెక్టు పట్టాలెక్కేదెప్పుడు ?
సాయి పల్లవి గతంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా, లవ్ స్టోరీ సినిమాల్లో నటించింది. మరోవైపు నాని, సాయి పల్లవి కూడా జంటగా నటించి రెండు బ్లాక్‌బస్టర్స్ ఎంసిఏ, శ్యామ్ సింగరాయ్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అన్నీ కుదిరితే నాని, శేఖర్ కమ్ముల సాయి పల్లవితో కలిసి పని చేయడం ఇది మూడోసారి అవుతుంది. శేఖర్ కమ్ముల సాధారణంగా తన సినిమాల మధ్య చాలా విరామం తీసుకుంటాడు. ఇటీవల కాలంలో తన ప్లాన్స్ మార్చుకుని బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టేస్తున్నాడు.
అయితే ప్రస్తుతం ఈ ముగ్గురు సెలబ్రిటీలు కూడా క్షణం తీరిక లేనంత బిజీగా ఉన్నారు. సాయి పల్లవి ప్రస్తుతం ఒకవైపు యశ్ నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ రామాయణంలో సీతగా నటిస్తోంది. మరోవైపు నాగ చైతన్యతో కలిసి తండేల్ చేస్తోంది. ఇక డైరెక్టర్ శేఖర్ కమ్ముల కూడా కుబేరుడు తర్వాత మళ్లీ ధనుష్‌తో కలిసి పని చేసే ప్లాన్‌లో ఉన్నాడు. నాని విషయానికి వస్తే తాజాగా సరిపోదా శనివారం మూవీతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. త్వరలో HIT 3 షూటింగ్ ను ప్రారంభించనున్నాడు. అలాగే శ్రీకాంత్ ఓదెలతో ఓ మూవీ కూడా రాబోతోంది. అంతేకాదు సుజీత్‌తో నాని యాక్షన్ థ్రిల్లర్ కోసం చర్చలు జరుపుతున్నాడు. నాని-శేఖర్ కమ్ముల మూవీకి సంబంధించిన షూట్ వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది.