Thandel : పుష్ప రాజ్ టైం ఇది ఎవరైనా తప్పుకోవాల్సిందే

Thandel : టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్టులలో నాగ చైతన్య హీరోగా నటిస్తున్న “తండేల్” మూవీ కూడా ఒకటి. వరుస ప్లాప్ ల తర్వాత ఈ సినిమా తో ఎలాగైనా హిట్టు కొట్టాలని నాగ చైతన్య కసిమీదున్నాడు. ఇక నాగచైతన్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రం తండేల్. గీత ఆర్ట్స్ బ్యానర్ లో దాదాపు 80 నుండి 100 కోట్ల బడ్జెట్ తో సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాను ఉత్తరాంధ్ర లో జరిగిన నిజ జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా దర్శకుడు చందు మొండేటి తెరపైకి తీసుకు వస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఖచ్చితంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అక్కినేని అభిమానులు చాలా నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వర్క్ షాప్ లో కూడా పాల్గొని రియాల్టీకి దగ్గరగా ఉండేలా సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే కొంత కాలంగా పెద్ద సినిమాలకు వస్తున్న ఇబ్బందే ఈ సినిమాకు వస్తుంది. అదే రిలీజ్ డేట్ ఇష్యూ. తాజా సమాచారం ప్రకారం తండేల్ (Thandel) మళ్ళీ వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది.

Naga Chaitanya Thandel movie postponed again?

మళ్ళీ తండేల్ వాయిదా? తప్పిస్తున్నారా?

ఇక తండేల్ సినిమా లాస్ట్ ఇయర్ దాదాపు ఏడాది కింద మొదలవగా, ఈ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ చేస్తామని అప్పుడు మేకర్స్ మాటిచ్చారు. కానీ సమ్మర్ నుండి షూటింగ్ డిలే వల్ల తప్పుకుంది. ఇక జులై లో లేదా ఆగష్టు లో వస్తారని అనుకుంటే దసరా కి షిఫ్ట్ చేసారు అప్పుడు. కానీ ఆ డేట్ కి కూడా కుదరక క్రిస్మస్ కి వాయిదా వేశారు. ఇది పక్కా అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. కానీ తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం తండేల్ క్రిస్మస్ నుండి కూడా తప్పుకుంటుందని సమాచారం. ఇక డిసెంబర్ లో క్రిస్మస్ బరిలో ఆల్రెడీ నితిన్ రాబిన్ హుడ్ నిలిచింది. అలాగే తండేల్ కూడా నిలబడింది. మరో మీడియం రేంజ్ హీరో సినిమా కూడా ఉన్నట్టు టాక్. కానీ తండేల్ మాత్రం వెనక్కి తగ్గిందని వార్తలు వస్తున్నాయి. దానికి పుష్ప సినిమానే కారణం అని అంటున్నారు నెటిజన్లు. ఎందుకంటే పుష్ప డిసెంబర్ లో రిలీజ్ అవుతుంది. కానీ క్రిస్మస్ కి మూడు వారాల గ్యాప్ ఉన్నా, పుష్ప ది రూల్ కి పాజిటివ్ టాక్ వస్తే.. సంక్రాంతి వరకూ లాంగ్ రన్ ఉండే ఛాన్స్ ఉంది. అందువల్ల తండేల్ ని తప్పిస్తున్నారన్న రూమర్ కూడా ఉంది.

- Advertisement -

సక్సెస్ కోసం నాగ చైతన్య కష్టం..

ఇక నాగ చైతన్య హీరోగా నటిస్తున్న ఈ తండేల్ (Thandel) సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. ఈ సినిమా కోసం రా& రస్టిక్ లో కంప్లీట్ చేంజ్ మేకోవర్ లో ఊర మాస్ గా కనిపిస్తున్నాడు. పైగా సినిమా కోసం నాగ చైతన్య డిఫరెంట్ ఫైట్స్ చేస్తున్నాడట. పైగా తండేల్ సినిమా నాగచైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. దాదాపు 80 నుండి 100 కోట్ల కి పైగా బడ్జెట్ ఈ సినిమాకు పెడుతున్నారు. పైగా పాన్ ఇండియా సినిమా కాబట్టి లాంగ్ రన్ కావాల్సి ఉంటుంది. ఈ మూవీ పై నాగచైతన్య చాలా హోప్స్ పెట్టుకున్నాడు. అందుకే ఎలాంటి రిస్క్ లేకుండా సోలో రిలీజ్ చేద్దామన్న ఆలోచనలో చై తో పాటు మేకర్స్ కూడా ఆలోచిస్తున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంత? తండేల్ ని నిజంగానే వాయిదా వేస్తున్నారా అనేది తెలియాలంటే మేకర్స్ నుండే క్లారిటీ రావాలి. ఇక ఈ సినిమా నుండి చాలా రోజులుగా అప్డేట్స్ కూడా రాలేదు. మరి తండేల్ మేకర్స్ నెక్స్ట్ ఎలాంటి అప్డేట్ ఇస్తారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు