Naga Chaitanya – Sobhita.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అక్కినేని నాగచైతన్య గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా ఈయన తన సినిమాల కంటే కూడా వ్యక్తిగత జీవితంలోనూ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో ఏ మాయ చేసావే సినిమా హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య ఆమెతో నాలుగేళ్ళు కాపురం చేసి, ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. అయితే విడాకుల సమయంలో అందరూ సమంతను విమర్శించారు కానీ నాగచైతన్యను ఒక్క మాట కూడా అనలేదు. దీనికి కారణం ఆయన అమాయకత్వం మరొకవైపు బడా ఫ్యామిలీ నుంచి వచ్చారన్న కారణం.. రెండూ కూడా నాగచైతన్యకు బాగా కలిసి వచ్చాయి.
నాగచైతన్య – శోభిత నిశ్చితార్థ..
ఇకపోతే నాగచైతన్య సమంతతో 2021 లో విడాకులు తీసుకుంటే, 2022లోని శోభితతో రిలేషన్ మొదలుపెట్టారు. ఆమెతో రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు వినిపించినా.. ఆ వార్తలు కొట్టి పారేసే ప్రయత్నం చేయలేదు. అలాగని నిజమని చెప్పలేదు. దీంతో వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఇక అందరి అంచనాలను నిజం చేస్తూ ఈ యేడాది ఆగస్టు 8వ తేదీన ఈ జంట నిశ్చితార్థం చేసుకుంది. ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇస్తూ సోషల్ మీడియా ద్వారా ఈ ఫోటోలను కూడా షేర్ చేశారు. ఇకపోతే నిశ్చితార్థం అయితే చేసాము కానీ వివాహానికి ఇంకా సమయం పడుతుందని, ఆలస్యంగా వివాహం జరిపిస్తామని నాగార్జున వెల్లడించారు.
త్వరలో డెస్టినేషన్ మ్యారేజ్..
అయితే ఇదిలా ఉండగా తాజాగా నాగచైతన్య శోభిత ధూళిపాళ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. నిజానికి వీరిద్దరూ ఎప్పుడు వివాహం చేసుకోబోతున్నారు అనే విషయాన్ని అటు అక్కినేని ఇటు ధూళిపాల కుటుంబ సభ్యులు ఎవరు ప్రకటించలేదు. కానీ త్వరలో వీరి వివాహం అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది. రాజస్థాన్ లేదా ఫారిన్లో వీరి వివాహం చాలా ఘనంగా జరిపించాలని, అందులోనూ డెస్టినేషన్ వెడ్డింగ్ జరిపించాలని అనుకుంటున్నారట. ఇకపోతే నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వగానే వీరి పెళ్లి జరగబోతుందని సమాచారం.
నాగచైతన్య – శోభిత మధ్య ఏజ్ గ్యాప్..
ఇకపోతే నాగచైతన్య 1986 నవంబర్ 23న హైదరాబాదులో జన్మిస్తే , శోభిత 1992 మే 31న ఆంధ్రప్రదేశ్లోని తెనాలిలో జన్మించింది. దీన్ని బట్టి చూస్తే వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ కేవలం ఆరు సంవత్సరాలు మాత్రమే. ఏది ఏమైనా వీరిద్దరూ త్వరలోనే డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోబోతున్నారు అని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
శోభిత నాగచైతన్య ప్రేమ డేటింగ్..
గత కొన్ని సంవత్సరాలుగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు చాలా వార్తలు వచ్చాయి. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. గతేడాది లండన్ లో ఒక రెస్టారెంట్లో వీరిద్దరూ కలిసి కనిపించారు. పైగా వీరిద్దరూ ఫారిన్ ట్రిప్పుకి వెళ్ళారు.వారి స్టేటస్లు దిగిన ఫోటోలు కూడా ఒకేలా కనిపించాయి. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు.