Naga Chaitanya: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఏ మాయ చేసావే సినిమాలో సహా నటిగా నటించిన సమంత ను దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు అయితే వివాహం జరిగిన నాలుగు సంవత్సరాలకే విడిపోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎవరికి వారు తమ కెరియర్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఊహించని విధంగా నాగచైతన్య ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిందంటూ ఒక వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
నాగచైతన్య – శోభిత ఎంగేజ్మెంట్ ఈరోజే..
తాజా సమాచారం ప్రకారం నాగచైతన్య ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల తో నేడు నిశ్చితార్థం చేసుకొని ఒకటి కాబోతున్నారంటూ ఒక వార్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. మరొకవైపు సినిమాలు, వెబ్ సిరీస్, టెలివిజన్ షోస్ చేసుకుంటూ దూసుకుపోతున్న నాగచైతన్య గత కొన్ని నెలలుగా ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో లవ్ లో ఉన్నాడు అంటూ పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. అంతే కాదు గతంలో వీళ్ళిద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు కూడా చక్కర్లు కొట్టాయి. పైగా ఫారిన్ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అప్పుడు కూడా వీరు రియాక్ట్ కాలేదు. అలాగని కొట్టి పారేయలేదు. ఇప్పుడు వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.
అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వనున్న నాగర్జున..
అంతేకాదు స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఈరోజు నిశ్చితార్థం చేసుకోబోతున్నారట. కుటుంబ సభ్యులు , కొంతమంది సన్నిహితులు , స్నేహితులతో పాటు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కాబోతున్నట్లు సమాచారం. అంతేకాదు నాగచైతన్య – శోభిత దూళిపాళ్ల నిశ్చితార్థానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ ని కూడా మరికొన్ని గంటల్లో నాగార్జున ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వార్తగా హల్చల్ చేస్తోంది. ఈ విషయం విని అక్కినేని అభిమానులు సంతోషంలో మునిగితేలుతున్నారు. చైతూ ఒక ఇంటివాడు కాబోతున్నాడు అంటూ సంబరాలు చేసుకుంటున్నారు.. అయితే ఎంగేజ్మెంట్ పై అక్కినేని ఫ్యామిలీ లేదా శోభిత నుంచి ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. అది వచ్చేవరకు ఎదురు చూడాల్సిందే. కానీ మొత్తానికైతే వీరిద్దరూ ఈరోజు నిశ్చితార్థం చేసుకోబోతున్నారంటూ వార్తలు ఒక సోషల్ మీడియా పోస్ట్ కూడా హల్చల్ చేస్తోంది.
నాగచైతన్య సినిమాలు..
నాగచైతన్య సినిమా జీవితం విషయానికి వస్తే, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారనే చెప్పాలి. చివరిగా లవ్ స్టోరీ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈయన, ఆ తర్వాత వచ్చిన కస్టడీ సినిమాతో డిజాస్టర్ ని చవిచూశారు. ఇక ఇప్పుడు మళ్లీ సాయి పల్లవి తో జతకట్టనున్నారు నాగచైతన్య. తాజాగా తండేల్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ అంచనాల మధ్య రానున్న ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని అభిమానులు నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలోనే మరొకవైపు ఈయన నిశ్చితార్థం చేసుకోబోతున్నారు అంటూ , దీనికి నాగార్జున అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వనున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజానిజాలు తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.