Mega Movie : చిరు స్టోరీ చరణ్ కు… నాగీతో క్రేజీ కాంబో సెట్ అయితే పూనకాలే

Mega Movie : మెగా అభిమానులకు పూనకాలు తెప్పించే క్రేజీ కాంబో ఒకటి లోడ్ అవుతోంది అంటూ ఓ వార్తా ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో తాజాగా చక్కర్లు కొడుతోంది. అది కూడా చిరు కోసం రెడీ చేసిన స్టోరీని చరణ్ కోసం వాడుకోబోతున్నారు అని గుసగుసలు విన్పిస్తున్నాయి. మరి మెగా హీరోలతో నాగి మామా చేస్తున్న క్రేజీ ప్లాన్ ఏంటో ఓ లుక్కేద్దాం పదండి.

చిరుతో అనుకున్న ప్రాజెక్టు ఇది కాదు

‘మహానటి’ విడుదలైన తర్వాత మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా చిత్రబృందాన్ని పిలిచి అభినందించారు. అప్పట్లో నాగ్‌ అశ్విన్‌, చిరంజీవి కలిసి పని చేస్తున్నారనే చర్చ జరిగింది. చిరంజీవి కోసం తన మనసులో స్క్రిప్ట్ ఉందని దర్శకుడే స్వయంగా చెప్పాడు. ‘పాతాళ భైరవి’ తరహాలో ఇదొక సోషియో ఫాంటసీ చిత్రమని హింట్ ఇచ్చాడు. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే  ఈ ప్రాజెక్టు ఇంకా పట్టాలెక్కలేదు. కానీ తాజాగా రిలీజైన ‘కల్కి’ కథను నాగీ ముందు చిరంజీవికి చెప్పారని ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది. అయితే ఆ ప్రాజెక్టుకు ప్రభాస్ కరెక్ట్ గా సెట్ అవుతాడని మెగాస్టార్ సూచించారని కొంతకాలం క్రితం వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ‘కల్కి’తో చిరంజీవికి ఎలాంటి సంబంధం లేదని, ఈ స్టోరీ లెజెండరీ నటుడు చిరు దగ్గరకు వెళ్లలేదని నాగ్ అశ్విన్ స్పష్టం చేశారు.

Director Shankar shares details upon the release of the Ram Charan starrer 'Game Changer' | - Times of India

- Advertisement -

నాగ్ అశ్విన్ మెగా ప్లాన్స్

చిరంజీవి కోసం తాను అనుకున్న వేరే కథ ఇంకా అలాగే ఉందని నాగ్ అశ్విన్ చెప్పడంతో త్వరలోనే దానిని సెట్స్ పైకి తీసుకురావాలని వైజయంతీ మూవీస్ ప్లాన్ చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘కల్కి 2’ పూర్తయిన తర్వాత నాగ్ అశ్విన్ చిరు కోసం రెడీ చేసిన స్క్రిప్ట్‌ను బయటకు తీసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇందులో చిరంజీవికి బదులు చరణ్‌ కథానాయకుడిగా నటిస్తాడని అంటున్నారు. చిరు ఇప్పటికే సోషియో ఫాంటసీ డ్రామా ‘విశ్వంభర’ మూవీని చేస్తున్నాడు. కాబట్టి ఇప్పట్లో చిరు మరోసారి అదే ఫాంటసీ జానర్‌ను టచ్ చేయకపోవచ్చు. కానీ చెర్రీకి మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

చిరు స్టోరీ చెర్రీకి.. నాగీ మాస్టర్ ప్లాన్

నిజానికి రామ్ చరణ్ కూడా ఇప్పటికే ఈ జానర్లో సినిమాను చేశాడు. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ చేసిన మగధీర అల్మోస్ట్ ఫాంటసీ అండ్ రివేంజ్ యాక్షన్ డ్రామానే. అయితే ఆ మూవీ వచ్చి ఏళ్లు గడుస్తోంది. కాబట్టి ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న చెర్రీ నాగీ మాస్టర్ ప్లాన్ లో భాగమైతే బాక్స్ ఆఫీసు రికార్డులన్నీ బ్రేక్ అవ్వాల్సిందే. మరి వస్తున్న టాక్ ప్రకారం రామ్ చరణ్, నాగ్ అశ్విన్ కాంబో నిజంగానే సెట్ అవుతుందా అనేది చూడాలి. ప్రస్తుతం నాగీ కల్కి సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. మరోవైపు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ తో పాటు బుచ్చిబాబుతో నెక్స్ట్ మూవీకి కమిట్ అయ్యాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు