Pushpa 2 Item Song : తెలుగులో కొన్ని పదాలు చాలా కన్ఫ్యూజ్ చేస్తాయి. అలా కన్ఫ్యూజ్ అయ్యే పదాల్లో భామ, బామ్మా కూడా ఉన్నాయి. భామ అంటే… అందంగా ఉండే యువతి. బామ్మా.. అంటే వయసు పెరిగిన వృద్ధురాలు. వీటి విషయాల్లో చాలా సార్లు తికమకపడిపోతారు అవుతారు. ఇలాంటి పరిస్థితి స్టైలీష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌గా మారిన అల్లు అర్జున్ (Allu Arjun) కి కూడా వచ్చినట్టు ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే, పుష్ప 2 (Pushpa 2) సినిమాలో ఓ ఐటెం సాంగ్ కోసం భామను కాకుండా బామ్మాను ఫైనల్ చేశారు అనే వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి.
పుష్ప సినిమాలో సమంత (Samantha) చేసిన ఐటెం సాంగ్ “ఊ అంటావా మావా ఊ ఊ అంటావా…” ఎంత పాపులారిటీ తెచ్చుకుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు పుష్ప 2 లో కూడా ఓ ఐటెం సాంగ్ ఉండబోతుంది. ఐటెం సాంగ్ ఫిక్స్ అని అందరికీ తెలిసు. కానీ, అందులో ఏ హీరోయిన్ డ్యాన్స్ చేయబోతుంది అనేది ఇప్పటికీ వీడని సస్పెన్స్‌లా తయారైంది. దీంతో రోజుకు ఓ న్యూస్ ఇటు ఇండస్ట్రీలో.. అటు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
రీసెంట్గా ఈ ఐటెం సాంగ్ కు సంబంధించి ఓ న్యూస్ ప్రస్తుతం తెగ చెక్కర్లు కొడుతుంది. అది ఏంటంటే… పుష్ప 2 సినిమాలో ఉండబోయే స్పెషల్ సాంగ్ లో ఓ సీనియర్ హీరోయిన్ ఉంటుందట. సీనియర్ అంటే అంతా ఇంత కాదు.. ఏకంగా 60 ఏళ్లు ఉన్న ఓ పాత హీరోయిన్ ఐటెం సాంగ్ చేయబోతుందని తెలుస్తుంది. ఆమె ఎవరో కాదు… మీనాక్షీ శేషాద్రి (Meenakshi Seshadri).
మీనాక్షీ శేషాద్రి ఎవరంటే..?
మీనాక్షీ శేషాద్రి అంటే ఈ తరం వాళ్లకు పెద్దగా తెలియదు. కానీ, పాత సినిమాలు చేసే వాళ్లు చిన్న ఐడియా ఉంటుంది. ఎక్కువగా బాలీవుడ్ సినిమాలు చేసిన మీనాక్షీ శేషాద్రి తెలుగులో ఎన్టీరామరావు (NT Ramarao) నటించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో మేనక పాత్ర చేసింది. అలాగే… మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా చేసిన ఆపద్బాంధవుడు సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాకు గాను మీనాక్షీ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌లో బెస్ట్ యాక్టరస్ కి కూడా నామినేట్ అయింది. అయితే చివరి సినిమా ఘాయల్ : వన్స్ అగైన్ (2016) లో గెస్ట్ గా కనిపించింది. దీని తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు. ఇప్పుడు పుష్ప 2తో రీ ఎంట్రీ ఇవ్వబోతుందని టాక్.
పుష్ప 2 పరిస్థితి…
పుష్ప 2 సినిమాకు బ్రేకులు పడ్డాయని గత కొన్ని రోజుల నుంచి వినిపిస్తుంది. అల్లు అర్జున్ గడ్డం తీసేయ్యడం, డైరెక్టర్ సుకుమార్ (Sukumar) విదేశాలకు వెళ్లడంతో ఈ వార్తలకు బలం పెరిగింది. అయితే రీసెంట్గా పుష్ప 2 సినిమా షూటింగ్ స్టార్ట్ అయిందని మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. కానీ, ప్రస్తుతం షూటింగ్ ఏం జరగడం లేదని సమాచారం. అయితే, పుష్ప 2 కు సంబంధించి ఎలాంటి వివాదాలు లేవని, సినిమా అనుకున్న డేట్ డిసెంబర్ 6నే రిలీజ్ కానుందని, మేకర్స్ చెబుతున్నారు. కానీ, ప్రస్తుతం పరిస్థితులు చూస్తే డిసెంబర్ 6న పుష్ప 2 థియేటర్స్ రావడం కష్టమే అనిపిస్తుంది. వచ్చే ఏడాది సమ్మర్ లో రానుందని టాక్.