Matka: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మెగా హీరోస్ లో వరుణ్ తేజ్ ఒకరు. ముకుంద సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు వరుణ్ తేజ్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. ఈ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక మంచి హీరో దొరికాడు అనిపించుకున్నాడు. ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ తన కెరియర్ లో చాలా డిఫరెంట్ సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాడు. అందరిలా కమర్షియల్ సినిమాలు కాకుండా లవ్ స్టోరీస్ తో పాటు కాన్సెప్ట్ బేస్ సినిమాలు కూడా చేశాడు.
ఇక ప్రస్తుతం పలాస సినిమా ఫ్రేమ్ దర్శకుడు కరుణ్ కుమార్ దర్శకత్వంలో మట్కా అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాలో మూడు గెటప్స్ లో కనిపించనున్నాడు వరుణ్ తేజ్. దాదాపు ఈ సినిమాకు సంబంధించి 50 కోట్ల వరకు బడ్జెట్ కానుంది. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మట్క సినిమా కూడా అంతగా ఏమీ లేదు అని తెలుస్తుంది. కాన్సెప్ట్ బేస్ సినిమాలకు కాసేపు బ్రేక్ ఇచ్చి కమర్షియల్ సినిమా చేసిన కూడా వర్కౌట్ కావట్లేదు అంటూ సోషల్ మీడియాలో ఆల్రెడీ టాక్ స్టార్ట్ చేశారు.
ఒక వరుణ్ తేజ్ లవ్ స్టోరీ మూవీస్ విషయానికి వస్తే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా అనే సినిమాను చేసాడు. ఈ సినిమాతో సాయి పల్లవి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయి మంచి కలెక్షన్స్ను రాబట్టింది. ఆ తర్వాత వెంకీ అట్లూరి దర్శకుడిగా పరిచయమైన తొలిప్రేమ సినిమా కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ రెండు సినిమాలు వరుణ్ తేజ్ కెరియర్ లో ది బెస్ట్ అని కూడా చెప్పొచ్చు.
రీసెంట్ టైమ్స్ లో వరుణ్ తేజ్ హిట్ సినిమా చూసి చాలా రోజులైంది. వరుణ్ తేజ్ చేసిన సినిమాలు వరుసగా ఫెయిల్ అవుతూ వచ్చాయి. ఈ తరుణంలో వరుణ్ తేజ్ కూడా నేను కాన్సెప్ట్ బేస్ సినిమాలు చేస్తున్నప్పుడు సినిమాలు ఫెయిల్ అవ్వచ్చు, కానీ నేను ఆ సినిమాలు చేయటం మాత్రం ఆపను. అవసరమైతే నా రెమ్యూనరేషన్ తగ్గించుకుంటాను అంటూ చెబుతూ వచ్చాడు. ఇక వరుసగా సినిమాను డిజాస్టర్లు పడటం వలన వరుణ్ తేజ్ మార్కెట్ కూడా దెబ్బతింది.