Manchu Family : ఇటీవల ఏపీ, తెలంగాణాలో భారీ వర్షాలు కురిశాయి.. ఆ వర్షాలకు వరదలు ముంచేత్తాయి.. తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోయారు. చిగురుటాకుల లాగా రాలిపోయారు. ఈ వరదలకు చాలా మంది కుటుంబాలను కోల్పోయారు. కనీసం ఉండటానికి చోటు, తినడానికి ఇల్లు లేక వరదల్లోనే కాలం గడిపారు.. ఇక వరదలతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఇక వరదలతో నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు పెద్ద ఎత్తున సినీ ఇండస్ట్రీ తరలివచ్చింది. సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు ఒక్కొక్కరు ముందుకు వచ్చి భారీ విరాళాన్ని ప్రకటించారు కానీ మంచు ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదని తెలుస్తుంది..
తెలుగు రాష్ట్రాలకు విరాళం ఇవ్వని మంచు ఫ్యామిలి..
టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ ఫ్యామిలలో మంచు ఫ్యామిలి (Manchu Family ) కూడా ఒకటి.. ఇండస్ట్రీలో ఒకప్పుడు మంచి ఫామ్ లో ఉన్న ఈ హీరోలు ఇప్పుడు ఇండస్ట్రీతో సంబంధం లేదని సైలెంట్ గా ఉన్నారు. ఏదైన సాయం కావాలంటే ముందుంటాము అని చెప్పేవాళ్ళు. కానీ తెలుగు రాష్ట్రాలకు వరదలు ముంచేసినా కూడా సాయం చెయ్యడానికి ముందుకు రాలేదు.. కనీసం ఎక్కడా వరదల గురించి మాట్లాడలేదు.. ముగ్గురు హీరోలు ఉన్నారు, కోట్ల ఆస్తి ఉన్నా కూడా ఒక్క రూపాయి కూడా ప్రజలకు కూడా ఇవ్వకపోవడం ఏంటి అని నెటిజన్లు దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు.. పేరు ముందు మంచు ఉంటే సరిపోదు.. మనసులో కాస్త మంచి ఉండాలి అంటూ కామెంట్ల తో తిట్టేస్తున్నారు.. మరి దీనిపై మంచు ఫ్యామిలీలో ఒక్కరన్నా రెస్పాండ్ అయి విరాళాలు ఇస్తారేమో చూడాలి.. ఇక వీరి సినిమాల విషయానికొస్తే .. మంచి విష్ణు ( Manchu Vishnu ) కన్నప్ప ( kannappa ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. డిసెంబర్ లో ఈ మూవీ విడుదల కాబోతుందని ప్రకటించారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
వరద భాధితులకు విరాళాలు ఇచ్చిన సెలెబ్రేటీలు..
మొన్నీమధ్య తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసిన వరదల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రజలకు సాయం చేసేందుకు సినీ తారలు ముందుకు వచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోని వరదల వల్ల సర్వం కోల్పోయిన ప్రజలకు అండగా తెలుగు ఇండస్ట్రీ ముందుకు వస్తుంది. ఇప్పటికే ఎంతో మంది సినీ తారలు తోచిన సాయం ప్రకటిస్తున్నారు. ఎన్టీఆర్ ( NTR ), విశ్వక్ సేన్ (Viswak Sen ), సిద్ధూ జొన్నలగడ్డ ( Siddu Jonnala gadda ), సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) , మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) వంటి సినీ స్టార్స్ తెలుగు రాష్ట్రాల సీఎం సహాయనిధులకు భారీ ఎత్తున విరాళం ప్రకటించారు. అలానే తాజాగా పాన్ ఇండియా స్టార్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా భారీ విరాళం ప్రకటించారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభాస్ ముందుకు వచ్చారు. ఎవరికీ తగ్గట్లు సాయం ప్రకటించి గొప్ప మనసును చాటుకున్నారు..