Mythri Movie Makers : టాలీవుడ్ లో ఇప్పుడు బడా నిర్మాణ సంస్థల్లో టాప్ లో ఉన్న సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అని తెలిసిందే. టాలీవుడ్ నుండి స్టార్ట్ అయి సౌత్ ఇండియా లోనే కాక, ఇప్పుడు బాలీవుడ్ లోనూ సినిమాలు తెరకెక్కిస్తూ అగ్ర పథంలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం మైత్రి చేతిలో చిన్నా, పెద్దా కలిపి ఏకంగా పది సినిమాలుండగా, అందులో సగం పాన్ ఇండియా సినిమాలే. మోస్ట్ అవైటెడ్ సినిమాలైన పుష్ప2, ఉస్తాద్ భగత్ సింగ్, RC16, ఇప్పుడు ప్రభాస్ – హను ప్రాజెక్ట్ ఇలా అన్ని బడా సినిమాలే ఉన్నాయి. ఇక టాలీవుడ్ లో ఇప్పటికే అందరు టాప్ హీరోలతోనూ సినిమాలు చేసిన మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ఇప్పుడు ఇతర భాషల్లోనూ పాగా వేశారు. అందర్నీ దాటుకుని పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు తీస్తున్నారు మైత్రి నిర్మాతలు.
సెన్సేషనల్ కాంబో సెట్ చేసిన మైత్రి నిర్మాతలు…
ఇక ప్రస్తుతం తమిళ్ లో అజిత్ తో “గుడ్ బ్యాడ్ అగ్లీ” తెరకెక్కిస్తున్న మైత్రి మూవీ మేకర్స్, తాజాగా ఓ సెన్సేషనల్ కాంబోని సెట్ చేసారని వార్తలు వస్తున్నాయి. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ (Lokesh kanagaraj) తో సినిమాని తెరకెక్కించేందుకు మైత్రి మూవీ మేకర్స్ సిద్ధమయ్యారు. ఇక లోకేష్ కానగరాజ్ వరుస పాన్ ఇండియా రేంజ్ సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు. ఖైదీ, విక్రమ్ లతో సరికొత్త సినిమాటిక్ యూనివర్స్ ని ఆరంభించిన విజయ్, రీసెంట్ గా ‘లియో’ తో భారీ వసూళ్లు కొల్లగొట్టగా, ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ తో “కూలీ” సినిమా చేస్తున్నాడు. అయితే ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ లోకేష్ కానగరాజ్ తో ఓ భారీ ప్రాజెక్ట్ ని సెట్ చేసినట్టు సమాచారం.
మిస్టర్ పర్ఫెక్ట్ తో సినిమా..
మైత్రి నిర్మాణ సంస్థ తాజాగా లోకేష్ కానగరాజ్ తో సినిమాని సెట్ చేస్తుండగా, ఈ ప్రాజెక్ట్ లో హీరోగా బాలీవుడ్ బడా స్టార్ అమీర్ ఖాన్ (Ameer khan) తో ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే లోకేష్ కానగరాజ్ కథ సిద్ధం చేస్తున్నట్టు, త్వరలోనే స్క్రిప్ట్ ఫైనల్ కాగానే అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారని సమాచారం. ఇక ఆల్రెడీ మైత్రి వారు హిందీలో గోపీచంద్ మలినేని దర్శకుడిగా, బాలీవుడ్ లో సన్నీ డియోల్ తో పాన్ ఇండియా సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు లోకి – అమీర్ ఖాన్ ప్రాజెక్ట్ గనుక సెట్ అయితే పాన్ ఇండియా రేంజ్ లో ఓ సెన్సేషనల్ ప్రాజెక్ట్ సెట్ అయినట్టే. మరి దీనిపై మేకర్స్ నుండి కన్ఫర్మేషన్ వచ్చే వరకు వెయిట్ చేయాలి.