Varun Tej – Lavanya : టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న జంటలలో లావణ్య, వరుణ్ తేజ్ జంట ఒకటి. వీరిద్దరి పెళ్లి అందరిని షాక్ కు గురి చేసింది. సైలెంట్ గా ప్రేమాయణం నడిపిన వీరిద్దరూ కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఇద్దరు ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. ఇకపోతే వీళ్లిద్దరు పెళ్లి చేసుకొని నవంబర్ 1 కి సరిగ్గా ఏడాది అవుతుంది. అయితే లావణ్య త్రిపాఠి త్వరలో మెగా ఫ్యామిలీ ని వదిలి తన పుట్టింటికి వెళ్ళిపోతుంది అంటూ సోషల్ మీడియా లో ప్రచారం అవుతుంది. అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
లావణ్య త్రిపాఠి ప్రస్తుతం కడుపుతో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆమె బేబీ బంప్స్ ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో ఆమె పుట్టింటికి వెళ్ళబోతుందని ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఏ ఆడపిల్ల అయిన గర్భం దాల్చిన కొన్నాళ్ళకు పుట్టింటికి వెళ్లి , కాన్పు అయ్యే వరకు తల్లిదండ్రుల సమక్షంలో ఉంటారు. అది మన సంప్రదాయం. లావణ్య త్రిపాఠి కూడా అదే చేయబోతుంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఎలాంటి సినిమాలు లేవు. ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తి చేసిన తర్వాతనే ఆమె వరుణ్ తేజ్ ని పెళ్లి చేసుకుంది.. ఇప్పుడు ఫ్రీగా ఉండటంతో బిడ్డను కనడానికి రెడీ అయ్యిందని వార్తలు వినిపించాయి.
రామ్ చరణ్, ఉపాసనలు గత ఏడాది క్లింకార రాకతో తల్లి దండ్రులు అయ్యారు. ఇప్పుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంట కూడా త్వరలో తల్లి దండ్రులు కాబోతున్నారు. త్వరలోనే మెగా ఫ్యామిలీ మరో చిట్టి పాప,లేదు బాబు అరుపులు వినిపించబోతున్నాయి అన్నమాట. మెగా ఫ్యామిలీ లో ఈ మధ్య ఆడపిల్లలే పుడుతున్నారు. మరి వీరికి పాపే పుడుతుందా అని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. వరుణ్ తేజ్ సినిమాల విషయానికొస్తే.. మట్కా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో మరి కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ తర్వాత వరుసగా మూడు సినిమాల్లో నటించబోతున్నాడు.