Lavanya – Raj Tarun : ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు దానిని విభిన్న కోణాలలో ఆలోచించడం అనేది సరైన పద్ధతి. ఒకరి మాటలు పరిగణలోకి తీసుకొని వేరే వాళ్ళను జడ్జి చేయలేము. ఇకపోతే లావణ్య రాజ్ తరుణ్ వ్యవహారం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు తనతో 11 సంవత్సరాలు కలిసి ఉండి ఇప్పుడు వేరే అమ్మాయితో రాజ్ తరుణ్ ఉంటున్నాడు అంటూ లావణ్య అనే అమ్మాయి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. ఇంతే కాకుండా చాలామంది మీడియా ఛానల్స్ వీళ్లను ఇంటర్వ్యూ కూడా చేశారు.
అయితే రాజ్ తరుణ్(Raj Tarun) లావణ్య (Lavanya)మధ్య మొదలైన ఈ వివాదం చిలికి చిలికి గాలి వానలా చాలామందికి పాకింది అని చెప్పాలి. ఈ వివాదంలో శేఖర్ భాష(Sekhar Basha), మస్తాన్ సాయి, ప్రీతి, ఉదయ్ వంటి కీలక వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. లావణ్య రాజ్ తరుణ్ కలిసి ఉంటున్న తరుణంలో ప్రీతి ఉదయ్ వాళ్ళిద్దరికీ బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళు. అయితే రాజ్ తరుణ్ లావణ్య నుంచి విడిపోయిన తర్వాత, లావణ్య పై ఈ ప్రీతి ఉదయ్ కూడా ఎదురు తిరిగారు. ఇప్పుడు అసలు వీలు బ్యాక్ స్టోరీ ఏంటి అని పోలీసులు ఆరా తీయటం మొదలుపెట్టారు. దీంట్లో ఎన్నో సంచలమైన వాస్తవాలు బయటపడ్డాయి. దృశ్యం సినిమా ట్విస్ట్ లు మించి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి.
డ్రగ్స్ పెడ్లర్ మస్తాన్ సాయి(Masthan Sai) కేసులో సంచలన విషయాలు. మస్తాన్ సాయి దగ్గర ఉన్న కొన్ని ఆధారాలు, కొన్ని వీడియోలు చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. మస్తాన్ సాయి అరెస్ట్‌తో కదులుతున్న డ్రగ్స్ డొంక. హైదరాబాద్‌లో డ్రగ్స్ సరఫరా, కస్టమర్ల వ్యవహారంపై పోలీసుల ఆరా. వెలుగులోకి మస్తాన్ సాయి స్నేహితురాలు ప్రీతి వ్యవహారం. బయటపడ్డ ప్రీతి, ఉదయ్ డ్రగ్స్ తీసుకుంటున్న వీడియోలు. అమ్మాయిలతో అసభ్యంగా ఫోటోలు, వీడియోలు రికార్డ్ చేసిన మస్తాన్ సాయి. డ్రగ్స్, గంజాయి సేవిస్తున్న సమయంలో వీడియోలు తీసుకున్న ప్రీతి (Preethi), ఉదయ్(Uday). డ్రగ్స్ కావాలి.. తీసుకురావాలని వాట్సాప్‌లో ప్రీతి చాటింగ్. ప్రస్తుతం రాజ్ తరుణ్ లావణ్య దగ్గర మొదలైన ఈ వివాదం ఎంతవరకు దారితీస్తుందో వేచి చూడాలి.