Kriti Shetty.. ప్రముఖ కన్నడ ముద్దుగుమ్మ కృతి శెట్టి (Kriti Shetty) ఇండస్ట్రీలోకి రాకముందు పలు రకాల ఉత్పత్తులకు బ్రాండ్ ప్రమోటర్ గా పనిచేసి, ఆ తర్వాత తెలుగులో నేరుగా మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) హీరోగా నటించిన ఉప్పెన (Uppena) సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే తన అందంతో , నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈ పాల బుగ్గల సుందరి , ఏకంగా రూ.100 కోట క్లబ్లో చేరిపోవడమే కాదు అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఫిలింఫేర్ అవార్డును కూడా సొంతం చేసుకుంది.
టాలీవుడ్ లో కనుమరుగవుతుందా..
దీంతో వరుస అవకాశాలు తలుపుతట్టాయి. అందులో భాగంగానే నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్, నాగచైతన్య , నాగార్జున కలిసి నటించిన బంగార్రాజు చిత్రాలలో అవకాశం లభించింది. ఇక ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయం సాధించడంతో ఈమెకు ఊహించని పాపులారిటీ లభించింది. అలా వరుసగా ఐదారు చిత్రాలలో నటించింది కృతి శెట్టి. ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లోనే హ్యాట్రిక్ అందుకున్న ఈమెకు ఆ తర్వాత ఎందుకో పెద్దగా కలిసి రాలేదు. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్ ఇలా చాలా చిత్రాలు డిజాస్టర్ గానే నిలిచాయి. దీంతో టాలీవుడ్ కి దూరం అయిపోయిందనే వార్తలు కూడా వినిపించాయి. కానీ ఇటీవల నాగచైతన్య హీరోగా డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన కస్టడీ సినిమాలో అవకాశం అందుకుంది . అయితే ఈ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది .దీనికి తోడు శర్వానంద్ హీరోగా వచ్చిన మనమే అనే సినిమాలో కూడా నటించింది కానీ ఈ సినిమా కూడా ఈమెకు కలిసి రాలేదు.
బాలీవుడ్ లో అవకాశం..
దీంతో టాలీవుడ్ కి గుడ్ బై చెప్పేసిందని వార్తలు వినిపించాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇక్కడ ఈమెకు అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో బాలీవుడ్ కి మకాం మార్చే ప్రయత్నం చేస్తోందని సమాచారం. ఇకపోతే తాజాగా అక్కడ మొదటి సినిమా అవకాశం కూడా అందుకున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ (Varun Dhawan) హీరోగా.. అతని తండ్రి డేవిడ్ ధావన్ (Devid Dhawan) దర్శకత్వం వహిస్తున్న ఒక కొత్త చిత్రంలో ఈమె హీరోయిన్ గా అవకాశం అందుకున్నట్లు సమాచారం. ఇక దీంతో బాలీవుడ్ లోకి కృతి శెట్టి అడుగుపెట్టిందని వార్తలు వినిపిస్తున్నాయి.
ముంబై వీధుల్లో విహరిస్తున్నకృతి శెట్టి .
మరోవైపు బాలీవుడ్లో కృతి శెట్టి అరంగేట్రం గురించి వార్తలు రావడంతో పాటు ఈ మధ్య ఈ ముద్దుగుమ్మ ముంబైలో కూడా కనిపించింది. కొత్త సినిమా ముహూర్తం త్వరలో జరుగుతుంది అని అందరూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అయితే బాలీవుడ్ లో అవకాశం అందుకున్న ఈ ముద్దుగుమ్మ, అప్పుడే గ్లామర్ షో చేయడం కూడా మొదలు పెట్టేసింది అని తెలుస్తోంది. ఏది ఏమైనా టాలీవుడ్ ను వదిలి బాలీవుడ్ కి వెళ్ళిపోయిన ఈమెకు అక్కడ అదృష్టం ఏ విధంగా తలుపు తడుతుందో చూడాలి.