Krishna Chaitanya: తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సాహిత్య రచయితగా ఎంట్రీ ఇచ్చాడు కృష్ణ చైతన్య. ఎన్నో అద్భుతమైన చిత్రాలకు మంచి పాటలను రాశాడు ఆ పాటలు కూడా మంచి హిట్ అయ్యాయి. అయితే నారా రోహిత్ హీరోగా చేసిన రౌడీ ఫెలో(Rowdy Fellow) సినిమాతో దర్శకుడుగా కూడా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. రౌడీ ఫెలో సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాకి కృష్ణ చైతన్య అందించిన డైలాగ్స్. ఆ సినిమాను తీసిన విధానం. ఆ సినిమాలో నారా రోహిత్(Nara Rohit) క్యారెక్టర్జేషన్ డిజైన్ చేసిన విధానం ఇవన్నీ కూడా ప్రేక్షకులకి ఆసక్తికరంగా అనిపించాయి.
అయితే ఆ సినిమా తర్వాత కృష్ణ చైతన్య చేసిన సినిమా ఛల్ మోహన్ రంగ(Chal Mohan Ranga). ఈ సినిమాకు కథను త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) అందించారు. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నిర్మాతగా నితిన్(Nithiin) కెరియర్ లో 25వ సినిమాగా ఈ సినిమా రిలీజ్ అయింది. మంచి అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిని విజయాన్ని సాధించలేకపోయింది. ఆ తర్వాత దర్శకత్వానికి కొంత గ్యాప్ ఇచ్చాడు కృష్ణ చైతన్య.
ఇక రీసెంట్ గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాతో మరోసారి దర్సకుడిగా ప్రేక్షకులు ముందుకు వచ్చాడు కృష్ణ చైతన్య. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఊహించిన స్థాయిలో ఆడకపోయినా కూడా కొంతమందికి లాభాలను తీసుకొచ్చి పెట్టింది. సినిమాలో విశ్వక్సేన్(Vishwak sen) నటించిన విధానం చాలామందిని ఆకట్టుకుంది ఇంతకుముందు ఎప్పుడు కెరియర్ లో నటించని విధంగా ఈ సినిమాలో నటించాడు విశ్వక్. ఇక ప్రస్తుతం కృష్ణ చైతన్య మెగా హీరో వైష్ణవ తేజ్(Vaishnav Tej) తో సినిమాను చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఉప్పెన సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు వైష్ణవ తేజ్. బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా సంచలమైన విజయాన్ని సాధించింది. దాదాపు 100 కోట్లు పైగా వసూలు చేసింది. మొదటి సినిమాతోనే 100 కోట్ల క్లబ్లో చేరిపోయాడు వైష్ణవ్. ఉప్పెన సినిమా తర్వాత ఇప్పటివరకు వైష్ణవ్ కెరియర్ లో సరైన హిట్ సినిమా లేదు అని చెప్పాలి. వరుసగా డిజాస్టర్ సినిమాలు చేస్తున్నాడు వైష్ణవ తేజ్. ఒకవేళ కృష్ణ చైతన్య తో సినిమా వర్కౌట్ అయి హిట్ అయితే కృష్ణ చైతన్య వైష్ణవ తేజ్ ఇద్దరికీ మంచి ప్లస్ అవ్వనుంది.