Kanguva : కంగువ అసలు ఆ సినిమాపై అంత కాన్ఫిడెన్స్ ఎందుకు.?

Kanguva : కోలీవుడ్లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమాల్లో కంగువ ఒకటి. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఒకప్పుడు సినిమాటోగ్రాఫర్ గా కెరియర్ మొదలుపెట్టిన శివ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో దర్శకుడుగా కొన్ని సినిమాలు చేసినా కూడా తమిళ్లో వరుస సూపర్ హిట్ సినిమాలు చేసి స్టార్ డైరెక్టర్గా అక్కడ పేరు సాధించాడు శివ. చివరగా రజనీకాంత్ తీసిన అన్నత్తే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన శివ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాతో మరోసారి ప్రేక్షకులు ముందుకు రానున్నాడు. అయితే ఈ సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన కంటెంట్ కూడా అదే స్థాయిలో ఉంది అని చెప్పొచ్చు.

కంగువ సినిమాని అక్టోబర్ 10 వ తారీఖున రిలీజ్ చేస్తారు అని ఇదివరకే అఫీషియల్ గా ప్రకటించారు. ఈ సినిమా ఆ డేట్ కి రావట్లేదు అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ దీని గురించి ఇంకా అధికార ప్రకటన రాలేదు. అదే రోజున రజనీకాంత్ నటిస్తున్న వెట్టేయన్ సినిమా కూడా రిలీజ్ కి సిద్ధమవుతుంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఆరోజు రెండు సినిమాలు పోటీలో పడతాయి అనుకున్న తరుణంలో ఈ సినిమా వెనక్క తగ్గుతుంది అని వార్తలు వినిపించడం ఆశ్చర్యం.

Kanguva

- Advertisement -

ఈ సినిమాపై ఇప్పటికే మంచి పాజిటివ్ బజ్ ఉంది. అయితే ఈ సినిమా గురించి ఈ సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్ తో పాటు దర్శకుడు, నిర్మాత జ్ఞానవేల్ రాజా వీళ్లంతా కూడా అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు. ఇక రీసెంట్ గా నిర్మాత జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ కంగువ సినిమా తో పాటు చాలా సినిమాలు రిలీజ్ అవ్వచ్చు కానీ కంగువ పార్ట్ 2 వచ్చినప్పుడు మాత్రం చాలా సినిమాలు ఈ సినిమాతో పాటు రిలీజ్ అవ్వడానికి భయపడతాయి అని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ యొక్క సత్తాని బాహుబలి సినిమా ఎలా చాటి చెప్పిందో తమిళ్లో ఈ సినిమా ఆ స్థాయిలో ఆడుతుంది అని అందరూ ఊహిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు