Kalki 2898 AD : ప్రభాస్ ను ఘోరంగా అవమానించిన మలయాళ హీరోయిన్

Kalki 2898 AD : ప్రస్తుతం ఇండియాలోనే నెంబర్ వన్ హీరో ఎవరు అని అడిగితే చిన్నపిల్లలు సైతం టక్కున ప్రభాస్ పేరు చెబుతారు. అయితే ఈ విషయాన్ని కొంతమంది హిందీ హీరోలు జీర్ణించుకోలేకపోతున్నారు అనుకోండి… అది వేరే విషయం. కానీ ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్కి మేనియానే కన్పిస్తోంది. ఇక ఈ సినిమాలో నటించిన నటీనటుల గురించే సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే కల్కి మూవీలో ఓ కీలక పాత్రలో నటించిన మలయాళ హీరోయిన్ నెట్టింట్లో ప్రభాస్ ను ఘోరంగా అవమానించింది. అసలేం జరిగిందంటే…

హీరోయిన్ రివ్యూ వైరల్…

కల్కిలో ప్రభాస్, దీపిక పదుకొనే, దిశా పటాని, అమితాబ్, కమల్ హాసన్ లతో పాటు ఎంతో మంది హీరో హీరోయిన్లు కొన్ని ముఖ్యమైన పాత్రలలో మెరిసిన విషయం తెలిసిందే. అందులో మలయాళ నటి అన్నా బెన్ కూడా ఒకరు. కల్కిలో అన్నా పాత్రపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఆమె దీపికా పదుకొనే పోషించిన పాత్ర సుమతిని బౌంటీ హంటర్స్ నుంచి రక్షించడంలో హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఆమె కోసమే తన జీవితాన్ని త్యాగం చేస్తుంది. ఈ మూవీ ద్వారా అన్నా బెన్ కు కూడా మంచి పాపులారిటీ దక్కింది. అయితే తాజాగా సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న కొన్ని స్క్రీన్ షాట్ లలో అన్కా కల్కి మూవీ గురించి రివ్యూ రాసినట్టుగా కనిపిస్తోంది.

నటి అన్నా బెన్ కల్కి చిత్రం

- Advertisement -

అందులో తను పోషించిన పాత్ర ఫైర్ క్రాకర్ అంటూ తనను తాను మెచ్చుకోవడమే కాకుండా ఆమె సన్నివేశాలను మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ సినిమాతో కంపేర్ చేసుకుంది. అలాగే అదే రివ్యూలో ప్రభాస్ పనితీరును విమర్శించి, ఆయన పరువు తీసేసిందని, ఈ సినిమాలో దిశా పటానితో ఆయన కలిసి పాడిన పాటను కూడా చులకన చేసిందని డార్లింగ్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అన్నా ఆ పోస్టులో మొదటి సగంలో కొన్ని క్షణాలు తీసేస్తే సినిమా నిజమైన క్లాసిక్ గా ఉంటుందని నేను భావించాను. ప్రభాస్ తమాషాగా ప్రయత్నించే అనవసరమైన కామెడీ చాలా భయంకరంగా అనిపించింది. అలాగే సినిమా ఫీల్ కి సరిపోని సాంగ్స్ సీక్వెన్స్ కూడా” అంటూ ఏకంగా ప్రభాస్ ని టార్గెట్ చేసి ఫీడ్ బ్యాక్ ఇవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఒక రకంగా అది నిజమే అయినప్పటికీ ఈ ఫ్రాంక్ ఫీడ్ బ్యాక్ అనేది ప్రభాస్ అభిమానులను కోపంతో ఊగిపోయేలా చేస్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ స్టోరీ ఇప్పుడు ఆమె ఇంస్టాగ్రామ్ ఖాతాలో కనిపించట్లేదు. అయితే ప్రభాస్ అభిమానులు ఫైర్ అవ్వడంతోనే ఆమె దానిని తొలగించినట్టు రూమర్స్ నడుస్తున్నాయి. మరి వైరల్ అవుతున్న ఆ స్క్రీన్ షాట్లు నిజమైనవా లేక ఫేకా అనే విషయంపై క్లారిటీ లేదు.

అన్నా బెన్ సినిమాలు…

మలయాళ నటి అయిన అన్నా బెన్ మాలీవుడ్ లో హెలెన్, కప్పెలా మరియు కుంబళంగి నైట్స్ చిత్రాలలో తన అద్భుతమైన నటనతో అభిమానులను సంపాదించుకుంది. కల్కిలో కైరా అనే పాత్రను పోషించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు