“ఐక్యమత్యమే మహాబలం” అంటారు పెద్దలు.. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉంటే ఎంతటి కష్టాన్నైనా సరే ఇట్టే తరిమికొట్టవచ్చు. ముఖ్యంగా వివాదాలకు చోటు ఇవ్వకుండా కుటుంబ సభ్యులంతా కలిసి ఉంటూ తమను తాము మరింత పదిలం చేసుకుంటున్నారు మెగా ఫ్యామిలీ. కానీ తెలుగు సినీ ఇండస్ట్రీకి బీజం పోసిన నందమూరి ఫ్యామిలీలో మాత్రం చిన్నపాటి గొడవలు అభిమానులకు తీరని నిరాశను మిగులుస్తున్నాయి. నందమూరి ఫ్యామిలీ అంటే అటు సినిమా పరంగే కాదు ఇటు రాజకీయపరంగా కూడా మంచి పేరు దక్కించుకుంది. అలాంటిది ఈ కుటుంబ నుంచి వచ్చిన బాలకృష్ణ , జూనియర్ ఎన్టీఆర్ లకు ఒకరంటే ఒకరికి పొసగడం లేదు. దీనికి వివిధ కారణాలు ఉండవచ్చు కానీ చూసే వారికి మాత్రం వీరిద్దరి మధ్య పాతకక్షలు ఉన్నాయేమో అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది.
ఎన్టీఆర్ – బాలకృష్ణ మధ్య దూరం పెరగడానికి కారణం..?
అటు నందమూరి, నారా ఫ్యామిలీ ఇద్దరూ కూడా ఎన్టీఆర్ ను దూరం పెట్టారనే వార్తలు తరచూ వినిపిస్తూనే ఉంటాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు 2019 లో టీడీపీ పార్టీ కనుమరుగవుతుందన్న నేపథ్యంలో ఎన్టీఆర్ రంగంలోకి దిగి జోరుగా టిడిపి పార్టీ తరఫున ప్రచారం చేశారు. అయితే దురదృష్టవశాత్తు పార్టీ ఆ సమయంలో ఓడిపోయింది. దాంతో పార్టీ కోసం కష్టపడిన ఎన్టీఆర్ ను కూడా నందమూరి, నారా కుటుంబ సభ్యులు దూరం పెట్టారంటూ వార్తలు రాగా.. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన ఎన్టీఆర్ ఈసారి కూడా పార్టీకు దూరంగా ఉండిపోయారు అంటూ అభిమానులు సైతం కామెంట్లు చేశారు.
బాలయ్య – ఎన్టీఆర్ మధ్య గొడవలు సమిసేనా..?
మరొకవైపు పలు సినిమా ఈవెంట్లలో కూడా బాలకృష్ణ పరోక్షంగా ఎన్టీఆర్ ని టార్గెట్ చేస్తూ కామెంట్లు చేశారనే వార్తలు వినిపిస్తూ ఉంటాయి. దాంతో అటు బాబాయ్ కి ఇటు పార్టీకి దూరంగా ఉండిపోయారు ఎన్టీఆర్. అంతేకాదు ఇటీవల బాలకృష్ణ ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ ఈవెంట్ నిర్వహించినప్పటికీ కూడా ఎన్టీఆర్ హాజరు కాలేదు. దీంతో అనుమానాలు మరింత బలమయ్యాయి.. అయితే ఈ అనుమానాలు, ఆరోపణలకు తెర దించుతూ.. మళ్లీ కుటుంబంతో కలిసి పోవాలని ఎన్టీఆర్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే ఇటీవల తన బాబాయి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి తొలి అడుగు వేయబోతున్న నేపథ్యంలో సెప్టెంబర్ ఆరవ తేదీన మోక్షజ్ఞ మొదటి సినిమా పోస్టర్ ను సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేస్తూ.. “తాత అంత ఎత్తుకు ఎదగాలని ఆశిస్తున్నాను అంటూ .. ఒక అన్నగా నీకు అండగా ఉంటాను” అని చెప్పుకొచ్చారు. కానీ బాలకృష్ణ అభిమానులు మాత్రం ఎన్టీఆర్ ను పూర్తిగా ఓన్ చేసుకోలేకపోతున్నారని చెప్పవచ్చు.
దేవర ట్రైలర్ పై నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్న బాలకృష్ణ ఫాన్స్..
దీనికి తోడు ఎన్టీఆర్ రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ చిత్రం తర్వాత సోలో హీరోగా నటించిన చిత్రం దేవర. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయగా, అటు నందమూరి బాలకృష్ణ అభిమానులు, టిడిపి శ్రేణులు ట్రైలర్ పై దారుణంగా ట్రోల్స్ వేశారు. ముఖ్యంగా ట్రైలర్ పై పూర్తిస్థాయి నెగెటివిటీ స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ నెగెటివిటీని తగ్గించడానికి కూడా ఎన్టీఆర్ తన మామ , ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కలవడానికి సచివాలయానికి బయలుదేరినట్లు సమాచారం.
సీఎంను కలవనున్న ఎన్టీఆర్ – రామ్ చరణ్..
అసలు విషయంలోకి వెళ్తే గత కొన్ని రోజుల క్రితం.. రెండు తెలుగు రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలను వరదలు ముంచెత్తడం వల్ల జలమయమయ్యాయి. ఇక ఆ ప్రాంతాలకు ఆర్థికంగా నిలబడడానికి పలువురు సెలబ్రిటీలు విరాళాలు ప్రకటిస్తూ ఆ చెక్కులను నేరుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను కలిసి ఇవ్వడానికి రామ్ చరణ్ తో కలిసి ఎన్టీఆర్ నేడు సచివాలయానికి వెళ్ళనున్నారు.
బాబాయ్ – అబ్బాయ్ మధ్య సఖ్యత సీఎం కుదిర్చేరా..
ఇటీవల తెలుగు రాష్ట్రాలు వరదల వల్ల చాలా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెలబ్రెటీలు రెండు రాష్ట్రాల సీఎం సహాయనిధికి విరాళాలు ఇచ్చారు. తారక్ కూడా కోటి రూపాయలను అనౌన్స్ చేశాడు. ఈ చెక్ ను ఏపీ సీఎం చంద్రబాబును కలిసి అందజేసి ఆ తర్వాత దేవర సినిమా టికెట్ రేట్లు పెంచమని అడగబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు తన బాబాయ్ బాలకృష్ణ తో సఖ్యత కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయని, ఈ సఖ్యతకు నారా చంద్రబాబు నాయుడు కారణం కాబోతున్నారని సమాచారం.
దాదాపు కొన్ని సంవత్సరాలుగా బాబాయ్ అబ్బాయి ఏవేవో కారణాలవల్ల దూరంగా ఉన్నారు కనీసం ఇలా అయినా సరే వీరిద్దరూ కలిసిపోవాలని మళ్లీ వేరు ఎప్పటిలాగే వరుస సక్సెస్ లు అందుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని అటు నారా నందమూరి అభిమానులు , టిడిపి శ్రేణులు కోరుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం ఎన్టీఆర్ తో కలవడం వల్ల ఎన్టీఆర్ కు మాత్రమే ప్రయోజనం కాదు అటు టిడిపి పార్టీకి కూడా ప్రయోజనం కలుగుతుందని చెప్పవచ్చు. ఎన్టీఆర్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది మరి .
ఆయన వల్ల టిడిపి ప్రభుత్వం మరింత అభివృద్ధి దిశగా అడుగు అడుగులు వేసే ప్రయత్నం కనిపిస్తోంది. ఏది ఏమైనా అటు సినిమా పరంగా ఇటు రాజకీయపరంగా వీరందరూ ఒక్కటైతే అభివృద్ధి మరింత జరుగుతుందని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. మరి నారా చంద్రబాబునాయుడు చొరవ తీసుకొని బాబాయ్ అబ్బాయి మధ్య సఖ్యత ఏ విధంగా కుదురుస్తారో చూడాలి.