Jayam Ravi.. ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి (Jayam Ravi) తాజాగా తన భార్య ఆర్తి (Arti)తో వైవాహిక బంధాన్ని రద్దు చేస్తూ విడాకులు ప్రకటించారు అయితే ఆయన విడాకులు ప్రకటించి ఇంకా ఒక రోజు కూడా గడవలేదు అప్పుడే ఇంకో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఆమె ఎవరు.? ఇక ఆర్తితో వైవాహిక బంధం రద్దు అనేది ప్లానింగ్ ప్రకారం చేశారా? అనే కొత్త అనుమానాలు అభిమానులలో తలెత్తుతున్నాయి. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం.
18 యేళ్ళ వైవాహిక బంధానికి ఐశ్వర్య స్వస్తి..
కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ (Rajinikanth)కి ఇద్దరు కూతుళ్లు. అందులో మొదటి అమ్మాయి ఐశ్వర్య(Aishwarya ),రెండో అమ్మాయి సౌందర్య(Soundarya ).ఇందులో మొదటి అమ్మాయి ఐశ్వర్య ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush)ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 18 సంవత్సరాలు కాపురం చేసి, ఇద్దరు కొడుకులకు జన్మనిచ్చిన తర్వాత విడాకులు ప్రకటించారు. రజనీకాంత్ రెండవ అమ్మాయి సౌందర్య కూడా ముందు ఒక అబ్బాయిని పెళ్లి చేసుకొని, అతడికి విడాకులు ఇచ్చి మళ్లీ వివాహం చేసుకుంది.
పక్కా ప్లానింగ్ తోనే ఆర్తికి విడాకులు..
ఇకపోతే తాజాగా రజినీకాంత్ తన పెద్ద కూతురు ఐశ్వర్య కి విడాకులు తీసుకున్న హీరోతో పెళ్లి చేయాలని చూస్తున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన ఎవరో కాదు జయం రవి. జయం రవి కూడా రజనీకాంత్ కూతురు ఐశ్వర్యాన్ని వివాహం చేసుకోవాలనుకున్నారు. అందుకే ఆర్తితో విభేదాలు వచ్చి విడిపోయారనే వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వీరిద్దరికీ పెళ్లి చేయాలని చూస్తున్నారట రజనీకాంత్. వాస్తవానికి గతంలో రజినీకాంత్.. జయం రవి, ఐశ్వర్య కు వివాహం జరిపించాలని చూశారు. కానీ అప్పటికే జయం రవి ఆర్తితో ప్రేమలో ఉండడంతో ఈ విషయం తెలుసుకున్న ఆర్తి తల్లి మంచి మనసున్న వ్యక్తిని దూరం చేసుకోవడం ఇష్టం లేక హుటాహుటిన ఇద్దరికీ వివాహం జరిపించింది.
జర్నలిస్టు మాటలు నిజం కానున్నాయా..
దీంతో రజినీకాంత్ సైలెంట్ అయిపోయారు. అయితే ఇటీవలే ఈ సీక్రెట్ ను సబితా జోసెఫ్ అనే జర్నలిస్ట్ బయటపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు జయం రవి విడాకులు తీసుకోవడంతో ఆ జర్నలిస్టు చెప్పిన మాటలు నిజమేనని ,ఇదంతా పక్కా ప్లానింగ్ తోనే జరిగిందని, అందుకే జయం రవి తన భార్యకు విడాకులు ఇచ్చి ఇప్పుడు ఐశ్వర్యను వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
వివాహానికి సిద్ధమవుతున్న జయం రవి – ఐశ్వర్య :
ప్రస్తుతం ఇద్దరూ కూడా తమ తమ వైవాహిక బంధాలకు పులిస్టాప్ పెట్టారు కాబట్టి ఇప్పుడు వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారని, ఈ వివాహానికి రజనీకాంత్ పెళ్లి పెద్దగా మారనున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో రజినీకాంత్ అనుకున్న మాటలను ఇప్పుడు నిజం చేయబోతున్నారా అన్నట్టుగా సమాచారం అందుతుంది. మరొకవైపు వరుస సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్న రజినీకాంత్ ఇంకొక వైపు కూతురుకి కొత్త జీవితాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు. మరి పూర్తి వివరాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.