Janhvi Kapoor : దేవర మూవీకి జాన్వీ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఇంతేనా?

Janhvi Kapoor : బాలీవుడ్ హాట్ బాంబ్ జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో సిజ్లింగ్ పిక్స్ ను పోస్ట్ చేస్తూ తరచుగా సందడి చేస్తూనే ఉంది. ఆమె షేర్ చేసిన ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతాయి. ఆమెను గ్లామర్ క్వీన్ గా కొలుస్తారు అభిమానులు. కానీ ఆ గ్లామరే ఇప్పుడు ఆమె కెరీర్ పై దెబ్బ వేసేలా కన్పిస్తోంది. తాజాగా జాన్వి ఫస్ట్ సౌత్ మూవీ దేవర కోసం తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంత అనే విషయం బయటకు వచ్చింది.

దేవరకి జాన్వి రెమ్యూనరేషన్ ఇంతేనా ?

ఓ వైపు అందాల డోస్ పెంచుకుంటూనే మరోవైపు ట్రెడిషనల్ లుక్స్ తో ఆకట్టుకుంటూ ముందుకు సాగుతోంది జాన్వి. దివంగత నటి శ్రీదేవి కుమార్తెగా జాన్వీ సినీ రంగ ప్రవేశం చేసి, స్టార్ కిడ్ బ్రాండ్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తోంది. సినిమాలు మాత్రమే కాదు వెబ్ సిరీస్‌లు, యాడ్ లతో ఫుల్ బిజీగా ఉంది. మరోవైపు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె ఫోటోలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇంత పాపులారిటీ ఉన్నప్పటికీ నటిగా సినీ పరిశ్రమలో తనేంటో నిరూపించుకోవడానికి జాన్వీ కపూర్ చాలా కష్టపడుతోంది. విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె దేవర మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతోంది. అయితే ఈ సినిమాకు గానూ జాన్వి తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దేవరలో యంగ్ టైగర్ తో కలిసి నటించడానికి జాన్వి 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇది ఒక హీరోయిన్ తీసుకునే సాధారణ రెమ్యూనరేషన్. సీనియర్ హీరోయిన్లు సైతం ఇప్పటికీ సినిమాలు చేయడానికి 3 నుంచి 5 కోట్లు తీసుకుంటున్నారు. అలాంటిది జాన్వి ఇంకా వాళ్ళ రేంజ్ పారితోషికం తీసుకుంటుండడంతో ఆమె పాత్రపై కొత్త అనుమానాలకు తావిచ్చింది.

Janhvi Kapoor Tollywood Debut in Devara: Sky-High Remuneration Talk |  Climaxahh

- Advertisement -

జాన్వి గ్లామర్ కే పరిమితమా?

ఎన్టీఆర్‌-కొరటాల కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటింగ్ పాన్ ఇండియా మూవీ దేవరతో టాలీవుడ్‌లోకి అడుగు పెడుతోంది జాన్వి. ఈ మూవీ సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఇటీవలే దేవర ట్రైలర్ రిలీజ్ కాగా, ఆశించిన రెస్పాన్స్ మాత్రం రాలేదు. పైగా అందులో జాన్వి అసలే కన్పించలేదు. ఇప్పుడేమో ఆమె ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంది అనే విషయం బయటకు రావడంతో అసలు జాన్వి పాత్రకు ఇందులో ఏమన్నా ప్రాధాన్యత ఉందా? అని అనుమాన పడుతున్నారు అభిమానులు. కొన్ని పెద్ద హీరోల సినిమాల్లో నటీమణులు కేవలం గ్లామర్‌కే పరిమితమవుతున్నారు. ఇప్పుడు ‘దేవర’ సినిమాలో జాన్వీ కపూర్‌ని గ్లామర్ డాల్‌గా ఉంచారా అనే ప్రశ్న తలెత్తింది. టాలీవుడ్‌లో జాన్వీ కపూర్‌కి ఇదే మొదటి సినిమా. ఈ సినిమాలో యాక్టింగ్ పరంగా తనను తాను ప్రూవ్ చేసుకుంటేనే సౌత్ లో నటించే మరిన్ని ఆఫర్లు వస్తాయి. అయితే కేవలం కొన్ని గ్లామర్ సన్నివేశాలకే ఆమె పరిమితం అంటూ వస్తున్న వార్తలపై ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే దేవరలో జాన్వీ కపూర్ పాత్ర గురించి తెలుసుకోవాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు