Jailor 2.. ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ (Rajinikanth) ఈ వయసులో కూడా వరుస సినిమాలు ప్రకటిస్తూ మరింత బిజీగా దూసుకుపోతున్నారు. సినీ ఇండస్ట్రీలో ఎవరికి దక్కని క్రేజ్ లభించిందినే చెప్పాలి. అటు మాస్ ఆడియన్స్ లో కూడా తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు రజినీకాంత్. ఒక తమిళ్ ఇండస్ట్రీలోనే కాదు సౌత్ ఇండస్ట్రీ తో పాటు బాలీవుడ్ అలాగే జపాన్ లో కూడా పేరు దక్కించుకున్నారు. తనదైన రీతిలో వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్న ఈయన యంగ్ హీరోలకి పోటీ ఇస్తూ కలెక్షన్ల పరంగా కూడా దూసుకుపోతున్నారు.
రజనీకాంత్ జైలర్ 2 లో విలన్ ఎవరు..?
ఇకపోతే గత ఏడాది జైలర్ (Jailor )సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న ఈయన ఇప్పుడు జైలర్ 2(Jailor 2) సినిమాను తెరకెక్కించే పనిలో పడ్డారు. మరోవైపు లోకేష్ కనగరాజు (lokesh kanagaraju)దర్శకత్వంలో కూలీ (Coolie)సినిమా చేస్తున్న విషయం తెలిసిందే .ఈ సినిమా పూర్తి అయిన వెంటనే జైలర్ 2 మీద ఫోకస్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా జైలర్ 2 సినిమాలో విలన్ గా ఎవరు నటిస్తున్నారు? అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జైలర్ సినిమాలో విలన్ గా వినాయకన్ (Vinayakan)నటించి తన పెర్ఫార్మ న్స్ తో ఆకట్టుకున్నారు. ఇప్పుడు కూడా అలాంటి ఒక అద్భుతమైన పర్ఫామెన్స్ అందించే విలన్ కోసం ఎదురుచూస్తున్నారు. అందులో భాగంగానే లోకేష్ కనగరాజు దర్శకత్వంలో వస్తున్న కూలీ సినిమాలో కూడా తెలుగు స్టార్ హీరో నాగార్జున (Nagarjuna)ను విలన్ గా తీసుకున్న విషయం తెలిసిందే.
జైలర్ 2 లో విలన్ గా శ్రీకాంత్..
ఇప్పుడు జైలర్ 2 పై అందరి కన్ను పడింది. అందులో భాగంగానే జైలర్ 2 సినిమా టాలీవుడ్ స్టార్ హీరో కం విలన్ గా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ (Srikanth) ను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీకాంత్ ఇప్పటికే అఖండ సినిమాలో పవర్ఫుల్ విలన్ గా కనిపించి అందరిని ఆకట్టుకున్నారు. విలనిజాన్ని పండించడంలో చాలావరకు సక్సెస్ అయ్యారని చెప్పాలి. అందుకే రజనీకాంత్ సినిమాలో శ్రీకాంత్ ని విలన్ గా తీసుకోవాలని లోకేష్ కనగరాజు ఆలోచిస్తున్నారట. ఒకవేళ లోకేష్ కనగరాజు తన ఆలోచనలకు రూపం దాల్చారు అంటే కచ్చితంగా శ్రీకాంత్ జైలర్ 2 సినిమాలో విలన్ గా నటించి మంచి పేరు సంపాదించుకుంటారని, ఈ సినిమా ఆయన కెరియర్ కు మంచి టర్న్ ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు.
శ్రీకాంత్ ఒప్పుకుంటారా..
శ్రీకాంత్ ఒకప్పుడు విలన్ గా నటించి ఆ తర్వాత ఫ్యామిలీ హీరోగా పేరు సొంతం చేసుకున్నారు. ఇక అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చిన ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి ప్రేక్షకులను అలరించారు. ఇక వరుస అవకాశాలు తగ్గుతున్న సమయంలో యూ టర్న్ తీసుకుని విలన్ గా అవతారం ఎత్తి అఖండ సినిమాలో తొలిసారి పవర్ఫుల్ విలన్ గా నటించారు. ఇక ఇప్పుడు జైలర్ 2 లో నటిస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజానిజాలు త్వరలోనే తెలియాల్సి ఉంది. మరి శ్రీకాంత్ ఈ పాత్రను చేస్తాడా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది.