Rajamouli – Allu Arjun : తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి ( Rajamouli ) తెరకేక్కిస్తున్న సినిమాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంది.. అందులో బాహుబలి సినిమాలు ప్రత్యేకం అనే చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన త్రిపుల్ ఆర్ సినిమా ఆస్కార్ కు ఎంపికైంది. ఈ సినిమా తర్వాత ఇప్పుడు మహేష్ బాబు (Mahesh Babu ) తో SSMB29 సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. అయితే తాజాగా రాజమౌళి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇండస్ట్రీలో రాజమౌలితో సినిమా చెయ్యాలని అందరు అనుకుంటారు. కానీ జక్కన్న మాత్రం ఓ హీరోతో అస్సలు సినిమా చెయ్యనని చెప్పేసాడట. ఆ హీరో ఎవరో ఎందుకు అలా అన్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
రాజమౌళి తో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు అందరు సినిమాలు చేశారు. కానీ రాజమౌళి, అల్లు అర్జున్ (Allu Arjun ) కాంబోలో సినిమా మాత్రం రాలేదు. కనీసం దీనిపై సోషల్ మీడియాలో కూడా వార్తలు వినిపించలేదు. అందుకు కారణం కూడా లేకపోలేదు. గతంలో జరిగిన ఓ ఇష్యూ కారణంగానే అల్లు అర్జున్ తో సినిమా చెయ్యనని జక్కన్న చెప్పాడు. అసలు ఏం జరిగిందంటే.. రాజమౌళి దర్శకత్వం వచ్చిన హిట్ సినిమాల్లో మగధీర కూడా ఒకటి.. ఈ సినిమాకు నిర్మాత్తగా అల్లు అరవింద్ (Allu Aravind ) వ్యవహారించారు. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. అయితే ఆ సినిమా విడుదల సమయంలో జక్కన్న కు అల్లు అరవింద్ మధ్య గొడవలు జరిగాయని వార్తలు వినిపిస్తున్నాయి.. అందుకే రాజమౌళి అల్లు అరవింద్ ను పక్కన పెట్టేసాడట..
ఇప్పటివరకు వీరి కాంబోలో సినిమా రాలేదు.. దాంతో అల్లు అర్జున్ తో కూడా సినిమా చెయ్యలేదట. ఇక ముందు కూడా వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుందని అనుకోలేం. మరి ఫ్యూచర్ లో సినిమా వస్తుందేమో చూడాలి. ఇకపోతే రాజమౌళి మహేష్ బాబు సినిమా వచ్చే నెల నుంచి సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. అలాగే అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ లో విడుదల కాబోతుంది. ఆ తర్వాత త్రివిక్రమ్ తో ఓ సినిమా చెయ్యబోతున్నాడు..