Indraja.. ప్రముఖ సీనియర్ బ్యూటీ ఇంద్రజ తన అందచందాలతో యువతను ఉక్కిరిబిక్కిరి చేయడమే కాదు.. నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మో అనే పాటతో మరోసారి అందర్నీ ఉక్కిరి బిక్కిరి చేసింది. కెరియర్ బిగినింగ్లో సపోర్టింగ్ రోల్స్ చేసిన ఇంద్రజ, ఆ తర్వాత యమలీల చిత్రంతో హీరోయిన్ గా మారిపోయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో ఈమెకు కూడా మంచి గుర్తింపు లభించింది. ఈ చిత్రానికి ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించగా.. మొదట ఇందులో హీరోయిన్ గా సౌందర్య ను అనుకున్నారు. కానీ ఆమె కమెడియన్ అలీతో జతకట్టడానికి నిరాకరించింది. దాంతో కొత్త అమ్మాయి కోసం ట్రై చేయగా ఇంద్రజకు హీరోయిన్గా అవకాశం లభించింది. ఈ సినిమా తర్వాత ఈమెకు మంచి క్రేజ్ తెచ్చిన చిత్రం అమ్మ దొంగ. కృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాలో ఆమని, సౌందర్య, ఇంద్రజ ముగ్గురు హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా కూడా విజయం సాధించడంతో ఇంద్రజకి ఆఫర్లు వెల్లువెత్తాయి.అయితే ఈ సినిమాకి డైరెక్టర్ సాగర్.
స్టార్ ఫిలిం హీరోల సినిమాలలో వరుస అవకాశాలు..
మరొకసారి కృష్ణ హీరోగా, సాగర్ డైరెక్షన్లో వచ్చిన ఒక సినిమా షూటింగ్ సమయంలో.. ఈమె చేసిన పనికి హర్ట్ అయిన సాగర్, ఈమెకు అక్కడే చుక్కలు చూపించారట మరి ఈమె చేసిన ఆ తప్పేంటో ఇప్పుడు చూద్దాం.అమ్మ దొంగ సినిమా తర్వాత కృష్ణ, డైరెక్టర్ సాగర్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం జగదేకవీరుడు. ఈ మూవీలో ఇంద్రజ కి డైరెక్టర్ సాగర్ మరో అవకాశం ఇచ్చారు. సీనియర్ నటి కే.ఆర్. విజయ ఈ సినిమాలో నటించారు ఇకపోతే స్వతహాగా ఆమె అత్యంత ధనవంతురాలు. ఆమెకు నిర్మాత ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తానన్నారట . అవసరం లేదు నేను ట్రైన్లో వస్తానని ఆమె తెలిపారు. కానీ ఇంద్రజ మాత్రం ఫ్లైట్ బుక్ చేయాల్సిందే.. నాకు జర్నీలో వాంతులు అవుతాయి. ముఖ్యంగా ట్రైన్ లో వాంతులు అవుతాయి. అందుకే ఇంద్రజ ఫ్లైట్ టికెట్ల సైతం బుక్ చేయమని డిమాండ్ చేసిందట.
బెట్టు చేసిన ఇంద్రజ..
దీంతో సాగర్ అక్కడున్న వారితో ఓకే ఫ్లైట్ టికెట్ బుక్ చేయండి. కానీ ఆమె షూటింగ్ కి వచ్చిన తర్వాత ఎవరు కూడా ఆమెతో మాట్లాడ్డానికి వీల్లేదు అంటూ ఆర్డర్ వేశారట. ఇక డైరెక్టర్ సాగర్ చెప్పినట్టే సెట్ లోకి వచ్చిన తర్వాత ఇంద్రజ తో ఎవరు కూడా మాట్లాడలేదు. అసలు విషయం తెలుసుకున్న ఇంద్రజ నాలుగు రోజుల తర్వాత డైరెక్టర్ సాగర్ వద్దకు వచ్చి బోరున ఏడ్చేసిందట.
రివేంజ్ తీర్చుకున్న డైరెక్టర్..
దాంతో డైరెక్టర్ మాట్లాడుతూ.. అసలు ఎక్కడో కింద స్థాయిలో ఉన్న నిన్ను, మేము పైకి తీసుకొచ్చాము. అలాంటిది నువ్వు నీ స్థాయిని కాపాడుకోవాలి. అదే నీ కెరీర్ కు మంచిది. కానీ నువ్వు ఇలా చేయడం నచ్చలేదు. ఇది నీకు చెప్పడం కోసమే మేము ఇలా చేసాము అంటూ తెలిపారట సాగర్. ఈ సినిమా తర్వాత మళ్లీ సాగర్ ఈమెతో పనిచేయలేదట . ఇక మొత్తానికైతే ఉన్న స్థాయిని కాపాడుకోకుండా బెట్టు చేసిన ఈమె పై డైరెక్టర్ గట్టి రివెంజ్ తీర్చుకున్నారంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే తప్పు తెలుసుకున్న ఇంద్రజ ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్ అయిపోయింది.. ఇటీవల రీయంట్రీ ఇచ్చిన ఈమె అప్పుడప్పుడు సినిమాలలో నటిస్తూనే.. శ్రీదేవి డ్రామా కంపెనీ , జబర్దస్త్ వంటి షోలలో జడ్జిగా కూడా ఇప్పుడు వ్యవహరిస్తోంది.