Heroine Simran: ఒకప్పటి స్టార్ హీరోయిన్ సిమ్రాన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా నందమూరి హరికృష్ణ ను మొదలుకొని చిరంజీవి వరకు చాలామంది హీరోలతో కలసి చిందేసింది ఈ ముద్దుగుమ్మ. ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ దక్కించుకున్న ఈమె కోలీవుడ్ స్టార్ హీరోలతో కూడా కలిసి నటించింది. ఇక ఒక్క తెలుగులోనే కాదు తమిళ్, హిందీ చిత్రాలలో కూడా నటించి మెప్పించింది. తెలుగులో మహేష్ బాబు, నాగార్జున , బాలకృష్ణ , చిరంజీవి వంటి స్టార్ హీరోలతో కలిసి నటించిన ఈమె ఎక్కువగా వెంకటేష్ , చిరంజీవి, బాలకృష్ణ , నాగార్జున వంటి హీరోలతో జతకట్టి స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది.
తెలుగు స్టార్ హీరోలతో సిమ్రాన్..
పైగా బాలకృష్ణతో కలిసి నటించిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆమెకు స్టార్డం కూడా లభించింది. అంతేకాదు సమరసింహారెడ్డి , నరసింహా నాయుడు లాంటి చిత్రాలు ఎంత హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక వెంకటేష్ తో కలిసుందాం రా, నాగార్జునతో బావ నచ్చాడు, అలాగే నువ్వొస్తావని సీతయ్య, యువరాజు ,రాకుమారుడు లాంటి ఎన్నో సినిమాలు ఈమెకు మంచి గుర్తింపును అందించాయి.
తమిళ్ స్టార్ హీరోలతో సిమ్రాన్..
తమిళ్ విషయానికొస్తే.. అజిత్, కమల్ హాసన్, శరత్ కుమార్ , విజయ్ దళపతి, విజయ్ కాంత్ వంటి హీరోల సరసన నటించిన సిమ్రాన్ మంచి ఊపు మీద ఉన్న సమయంలో ఒక హీరో ప్రేమలో పడిందట. అయితే బ్రేకప్ మరో హీరో వల్ల జరిగిందని సమాచారం. మరి ఇంతకు సిమ్రాన్ ప్రేమించిన ఆ వ్యక్తి ఎవరు? ఏ హీరో కారణంగా ఆమె తన ప్రేమను బ్రేకప్ చేసుకుంది.? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
స్టార్ హీరోని గాఢంగా ప్రేమించిన సిమ్రాన్..
ప్రముఖ స్టార్ హీరో , కొరియోగ్రాఫర్ రాజు సుందరం మాస్టర్ తో ఈమె ప్రేమలో ఉందని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇందులో ఎంత నిజమందో తెలియదు కానీ ఈ విషయాలు అప్పట్లో సోషల్ మీడియాలో తెగ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా వీరిద్దరూ చాలా ఘాఢంగా ప్రేమలో మునిగితేలారట.వీరి బంధం పెళ్లి వరకు వెళ్లిందట. అయితే అదే సమయంలో హీరోయిన్గా వేరే హీరోతో చేసిన సినిమా వీరి బ్రేకప్ కు కారణం అయ్యిందని తెలుస్తోంది.
కమల్ హాసన్ వల్లే బ్రేకప్..
ఆయన ఎవరో కాదు కమల్ హాసన్. ముఖ్యంగా కమలహాసన్ తోనే కాదు బాలయ్య వంటి స్టార్ హీరోలతో కూడా ఘాటు రొమాన్స్ చేసింది. కానీ కమలహాసన్ తో లిప్ లాక్ సీన్ చేయవలసి రావడంతో ఆమె తప్పని పరిస్థితుల్లో ఆ సన్నివేశంలో నటించిందట. దాంతో తన బాయ్ ఫ్రెండ్ కు ఈమెకు మనస్పర్దలు వచ్చి బ్రేకప్ అయ్యిందని సమాచారం. అయితే ఒక సన్నివేశం కారణంగా ప్రేమించిన వాడికి దూరం కావడంతో ఎంతో నరకం చూసిందట సిమ్రాన్. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
ప్రస్తుతం పిల్లాపాపలతో హ్యాపీ..
ప్రస్తుతం పెళ్లి చేసుకున్న సిమ్రాన్ భర్త, పిల్లలతో హ్యాపీగా గడిపేస్తోంది. అంతేకాదు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ మరింత బిజీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ.